Nani: మరొకసారి గట్టిగా ప్రయత్నిస్తున్న నాని.. తమిళ్ ప్రేక్షకులు ఈసారైనా ధియేటర్ లకి వస్తారా?

Saripodhaa Sanivaaram Review: నాచురల్ స్టార్ నానికి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ గత కొంత కాలంగా తమిళ్ లో మాత్రం నాని సినిమాలకి కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. ఎంత భారీగా ప్రమోట్ చేసినా కూడా నాని సినిమాలు కేవలం సింగిల్ డిజిట్ కలెక్షన్లు మాత్రమే అందుకోగలుగుతున్నాయి. మరి సరిపోదా శనివారం సినిమాతో.. నాని ఈ రికార్డు ని బ్రేక్ చేస్తాడా లేదా అని సర్వర్త్ర ఆసక్తి నెలకొంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 23, 2024, 02:45 PM IST
Nani: మరొకసారి గట్టిగా ప్రయత్నిస్తున్న నాని.. తమిళ్ ప్రేక్షకులు ఈసారైనా ధియేటర్ లకి వస్తారా?

Saripodhaa Sanivaaram release date: నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న నాని గతేడాది విడుదలైన రెండు సినిమాలతోనూ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న, దసరా సినిమాలు ఈ మధ్యనే ఫిలిం పేర్లు కూడా బోలెడు అవార్డులు అందుకున్నాయి. 

తెలుగులో నాని సినిమాలు ఎంత బాగా హిట్ అవుతున్నప్పటికీ.. కరోనా తర్వాత నాని సినిమాలో తమిళ్ లో ఆడటం తగ్గిపోయింది. నాని చేసిన మూడు సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్లు అందుకున్నప్పటికీ తమిళ్లో మాత్రం కనీసం డబల్ డిజిట్ కూడా అందుకోలేకపోయాయి. 

నాని ముందు మూడు సినిమాలు చూస్తే అంటే సుందరానికి సినిమా తెలుగులో కూడా యావరేజ్ కానీ నిలిచింది. తమిళ్లో ఆ సినిమా కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. దసరా సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది కానీ తమిళ్లో కేవలం 2.75 కోట్లు మాత్రమే నమోదు చేసుకోగలిగింది. 

హాయ్ నాన్న కూడా తెలుగులో సూపర్ హిట్. తమిళ్లో ఈ చిత్రం నాలుగు కోట్లు కలెక్షన్లు అందుకుంది. నాని సినిమాల గ్రాస్ కలెక్షన్లు డబల్ డిజిట్ మాత్రం అందుకోలేకపోతున్నాయి. కానీ సరిపోదా శనివారం సినిమాతో నాని ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. 

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం నాని భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. ఉదయం 6:00 నుంచి మొదలుపెడితే రాత్రి 10:00 దాకా సినిమా ప్రమోషన్లు తోనే బిజీగా ఉన్నారు. 

మరి ఈసారైనా తమిళ్ ప్రేక్షకులు దానికోసం థియేటర్లకు వస్తారా.. లేదా నాని సినిమాలను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తారా అని వేచి చూడాలి. తమిళ్ లో మంచి పేరు ఉన్న ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక ఆరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Also Read: Sana Ganguly: తల్లి డ్యాన్సర్‌.. తండ్రి స్టార్‌ క్రికెటర్‌.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్‌ ఏంటో తెలుసా? 

Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News