Priyamani remuneration: హిట్ ల మహిమ.. పారితోషికం భారీగా పెంచేసిన ప్రియమణి!

Priyamani remuneration: హీరోయిన్ ప్రియమణి తాజాగా నటించిన వెబ్ సిరీస్ 'భామాకలాపం'. ఈ సిరీస్ హిట్ అవ్వడంతో... ఈ అమ్మడు భారీగా పారితోషికం పెంచేసినట్లు తెలుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 12:36 PM IST
Priyamani remuneration: హిట్ ల మహిమ.. పారితోషికం భారీగా పెంచేసిన ప్రియమణి!

Priyamani remuneration: ఏ పాత్రలోనైనా నటించగల అతికొద్ది  నటీమణుల్లో ప్రియమణి (Priyamani) ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. పెళ్ళైనకొత్తలో, శంభో శివ శంభో, యమదొంగ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు పలు భాషల్లో కూడా నటించి... మెప్పించింది. 

గతేడాదితో నారప్పతో విజయం అందుకున్న ఈ బ్యూటీ...తాజాగా 'భామాకలాపం' (Bhama Kalapam) అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహా ఓటీటీ వేదికగా రిలీజైన ఈ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించింది.  ఇందులో ప్రియమణి నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ వెబ్ సిరీస్ హిట్ అవడంతో..ప్రియమణి రెమ్యూనరేషన్ (Priyamani remuneration) భారీగా పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

భామాకలపాం వెబ్ సిరీస్ కు రోజుకు దాదాపు 1.5 లక్షల రూపాయల తీసుకుందట ప్రియమణి. ఇప్పుడు ఏకంగా డే కు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్టార్ నటి రానా 'విరాటపర్వం'లో (Virata parvam)  కీలకపాత్ర పోషిస్తోంది. 

Also Read: Anushka Shetty Casting Couch: టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. నేను కూడా..! షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News