Ante Sundaraniki on Netflix: నెలలోపే ఓటీటీలోకి 'అంటే సుంద‌రానికి'.. ఏ రోజు విడుదలవుతుందంటే?

Ante Sundaraniki on Netflix: నాని హీరోగా మలయాళీ భామ న‌జ్రియా న‌జీమ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'అంటే సుంద‌రానికి' ఓటీటీలో సందడి చేయడానికి సర్వం సిద్దమయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2022, 06:33 PM IST
  • నాని, న‌జ్రియా న‌జీమ్ కాంబినేష‌న్‌లో 'అంటే సుంద‌రానికి'
  • థియేటర్లలో సందడి చేస్తోన్న 'అంటే సుంద‌రానికి'
  • ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్
 Ante Sundaraniki on Netflix: నెలలోపే ఓటీటీలోకి 'అంటే సుంద‌రానికి'.. ఏ రోజు విడుదలవుతుందంటే?

Ante Sundaraniki on Netflix: న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా మలయాళీ భామ న‌జ్రియా న‌జీమ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'అంటే సుంద‌రానికి'.  యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని,  వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. జూన్‌ 10న తెలుగు,  తమిళ్,  మలయాళం భాషల్లో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. 'అంటే సుంద‌రానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరు సినిమా విడుదలకు ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. 

అయితే ఈ సినిమా ఓటీటీలో అంత త్వరగా విడుదల కాదని ఆయన చెప్పినా ఇప్పుడు మాత్రం విడుదలకు సిద్ధమైంది.  ఇటీవల కాలంలో టాప్ హీరోల సినిమాలు అయినా సరే సరిగ్గా కలెక్షన్స్ కనుక రాకుంటే రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ ఇదివరకే జరిగి ఉన్న క్రమంలో ఈ సినిమా నిర్మాత చెప్పినట్టు లేట్ కాకుండా సరిగ్గా 28 రోజులకే డిజిటల్ లోకి వచ్చేస్తోంది. ఈ చిత్రంలో సుందర్‌గా నాని,  లీల పాత్రలో నజ్రియా నజిమ్ కనిపించగా నరేశ్‌,  రోహిణి,  నదియా,  హర్షవర్ధన్‌,  రాహుల్‌ రామకృష్ణ,  సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

తాజాగా ‘అంటే సుందరానికీ!’ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్‌ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లో తెలుగు,  తమిళం,  మలయాళం భాషల్లో జులై 8 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. మతాంతర వివాహం అనే ఒక సీరియస్ సబ్జెక్ట్ ను ఎంచుకుని చాలా కామెడీగా చూపించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇక ఈ సినిమా నెలలోపే నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతున్న క్రమంలో ఇప్పట్లో విడుదల కాదన్న నిర్మాత కామెంట్స్ ను గుర్తు చేస్తూ కామెంట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. మరికొంతమంది మాత్రం సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.  

Also Read: Green India Challenge: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలి..బాలీవుడు నటుడు సల్మాన్‌ఖాన్‌ పిలుపు..!
Also Read: Radhe Shyam in Zee Telugu: బుల్లితెరపై సందడి చేసేందుకు సర్వం సిద్ధం.. ప్రీమియర్ ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News