దండుపాళ్యం సినిమాతో డైరెక్టర్‌గా శ్రీనివాస్ రాజు తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. దండుపాళ్యంతో క్రూరమైన సన్నివేశాలు తీసిన దర్శకుడు ఇప్పుడు ప్రేమ కథతో ముందుకు వచ్చాడు. తగ్గేదేలే అంటూ శ్రీనివాస్ రాజు నవీన్ చంద్రను కొత్త యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేశాడు. దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీని భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ కుమార్ పాండే, పి. వి. సుబ్బారావు రెడ్డిలు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 4న విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
ఈశ్వర్ (నవీన్ చంద్ర) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ వీరి మధ్యలోకి లిజి (అనన్యా సేన్ గుప్తా) వస్తుంది. ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇవ్వడం, ఆ తరువాత లిజి కొన్ని ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది. ఈశ్వర్, లిజి క్లోజ్‌గా ఉన్న ఫోటోల వెనుకన్న కథ ఏంటి?. అసలు లిజి తో ఈశ్వర్ కు ఎలా పరిచయం ఏర్పడింది?. ఆ వీడియోలు ఆమె వద్దకు వెలా వచ్చాయి? అని ఓ వైపు కథ జరుగుతుంది. ఇక ఈశ్వర్ ఇంట్లో ఓ మహిళ శవం కూడా బయట పడుతుంది. దీంతో ఈశ్వర్‌కు, దండుపాళ్యం బ్యాచ్‌కు సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తారు. ఈశ్వర్‌ను అరెస్ట్ చేస్తారు. ఈశ్వర్ చెప్పే సంగతులు ఏంటి? అసలు ఆ మహిళ ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారు? ఈశ్వర్ ఈ హత్యా నేరం నుంచి ఎలా బయటపడ్డాడు? ఈశ్వర్‌కు, దండుపాళ్యం బ్యాచ్‌కు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న లింక్ ఏంటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) వీరి కథను ఎలా ముగించాడు? అనేవి ఆసక్తికరంగా మారుతాయి.
నటీనటుల పనితీరు
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నవీన్ చంద్ర చక్కగా నటించాడు. అయితే ఇందులో నవీన్ చంద్రకు నటించే స్కోప్ ఎక్కువగా లభించింది. వేరియేషన్స్ చూపించే చాన్స్ వచ్చింది. అయితే హీరోయిన్లు మాత్రం కేవలం గ్లామర్ పార్ట్ కోసమే ఉన్నట్టుగా అనిపించింది.చలపతి పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా రవిశంకర్ మంచి పాత్రలో నటించాడు. పోలీస్‌గా రాజా రవీంద్ర తనకు అలవాటైన పాత్రల్లో అవలీలగా నటించేశాడు. దండుపాళ్యం గ్యాంగ్ మరోసారి భయపెడుతుంది. హీరో స్నేహితులు గా 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్ కామెడీ ట్రాక్ వర్కౌట్ అయింది. '30 ఇయర్స్' పృథ్వీ పాత్ర కూడా మెప్పిస్తుంది.
విశ్లేషణ
తగ్గేదేలే సినిమా కొత్తది కాకపోయినా కూడా ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. మర్డర్ మిస్టరీ, డ్రగ్స్, లవ్ చుట్టూ తిరిగే కథ కావడంతో కాస్త మాసీగా, రా గా అనిపిస్తుంది. ఇందులో వచ్చే ట్విస్ట్స్& టర్న్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. కథను అనుకున్నట్టుగా తెర మీదకు తీసుకురావడం అంత ఈజీ కాదు. కానీ ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది.
అయితే క్లైమాక్స్ సీన్స్ మాత్రం మరీ దారుణంగా ఉంటాయి. రోమాలు నిక్కబొడుచుకునేలా డిజైన్ చేశారు. ఇందులోని యాక్షన్ సీన్స్ చూస్తుంటే దండుపాళ్యం సినిమాకు మించినట్టుగా అనిపిస్తాయి. ఈ సినిమా నేపథ్య సంగీతం సీన్స్‌లోని ఇంటెన్సిటీనీ చూపించింది.
సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి. హెచ్ ఎడిటింగ్, వెంకట్ ఆరే ఫైట్స్ బాగున్నాయి ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు..మర్డర్ మిస్ట్రీ, లవ్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘తగ్గేదే లే' సినిమా కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.
రేటింగ్ 2.75
గమనిక : ఈ సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.దీన్ని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.
Also Read : శర్వానంద్ డబుల్ మీనింగ్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ
Also Read :The Ghost OTT : ఓటీటీలో టాప్ ప్లేస్‌లో The Ghost.. నాగార్జున ట్వీట్‌పై నెటిజన్ల రియాక్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook