Nayanthara Updates: సంజయ్ లీలా భన్సాలీ మూవీలో నయనతార?

Nayanthara Updates: లేడీ సూపర్ స్టార్ నయనతార రీసెంట్ గా జవాన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ మూవీలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 07:08 PM IST
Nayanthara Updates: సంజయ్ లీలా భన్సాలీ మూవీలో నయనతార?

Nayanthara in Sanjay Leela Bhansali's new film?: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా కాదు. ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ. ఇందులో నయన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ బ్యూటీకి బీటౌన్ నుంచి భారీగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) రాబోయే ప్రాజెక్ట్ బైజు బావ్రాలో(Baiju Bawra Movie) నయన్ ఓ కీలక పాత్రను చేయబోతుందని.. దీని కోసం మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ మూవీ 1950ల నాటి మ్యూజికల్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. 

సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకు స్పెషల్ ఆడియెన్స్ ఉంటారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అందుకే సంజయ్ కూడా ఆచితూచి సినిమాలు చేస్తుంటారు. పద్మావతి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత సంజయ్ లీలా భన్సాలీ-రణవీర్ కాంబోలో వస్తున్న మూవీ బైజు బావ్రా. ప్రస్తుతం నయనతార(Nayanthara) కోలీవుడ్ లో నటించిన 'ఇరైవన్' చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఇందులో జయం రవి హీరోగా నటించాడు. ఈ మూవీ అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గాడ్'(God) అనే పేరుతో తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో నయన్ ఎక్కువగా కోలీవుడ్ సినిమాలనే చేస్తుంది. టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. 

Also Read: Bigg Boss 7 Telugu: హౌస్ లోకి గౌతమ్ రీ ఎంట్రీ.. వచ్చి రాగానే హౌస్ మేట్స్ పై ఫైర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News