Kalki Cinematic Universe: సుప్రీమ్ యాస్కిన్ పాత్ర మీద సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా!

Kamal Haasan Supreme Yaskin: ప్రభాస్ నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో విడుదలైన కల్కి 2898 AD..సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు అందుకుంటోంది. ఈ సినిమాలో కమల్ హాసన్.. సుప్రీమ్ యాస్కిన్.. అనే నెగెటివ్ పాత్రలో కనిపించారు. అయితే కల్కి సీక్వెల్ గురించి పక్కన పెడితే.. కేవలం సుప్రీమ్ యాస్కిన్ పాత్ర మీదే ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది.. అని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 2, 2024, 09:00 PM IST
Kalki Cinematic Universe: సుప్రీమ్ యాస్కిన్ పాత్ర మీద సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా!

Supreme Yaskin Decoding: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి.. సినిమా ఈ మధ్యనే విడుదలై ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను.. క్రియేట్ చేస్తోంది. బాహుబలి సినిమాతో తాను క్రియేట్ చేసిన రికార్డులను.. మళ్ళీ ప్రభాస్ తిరిగి కల్కితో సృష్టిస్తున్నారు. విడుదలైన మొదటి రోజు నుంచి.. ఈ సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో.. కమల్ హాసన్ ముఖ్య.. విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో కమల్ హాసన్.. సుప్రీమ్ యాస్కిన్.. అనే పాత్ర పోషించారు. ప్రభాస్ భైరవ పాత్ర.. ఎప్పటికైనా వెళ్లాలి అనుకునే కాంప్లెక్స్.. ప్రపంచం సుప్రీమ్ యాస్కిన్ చేతుల్లోనే ఉంటుంది. 

నిజానికి సుప్రీమ్ యాస్కిన్.. పాత్ర సినిమాలో కనిపించేది కేవలం 10 నిమిషాల కంటే తక్కువే. కానీ ఆ పాత్రలో కమల్ హాసన్..ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేనిది. అయితే కేవలం.. సుప్రీమ్ యాస్కిన్ పాత్ర మీదే.. ఒక సినిమా గురించి ఆలోచిస్తున్నామని చిత్ర నిర్మాత అశ్విని దత్.. చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. 

కమల్ హాసన్ ను సుప్రీమ్ యాస్కిన్.. పాత్రలో ప్రేక్షకులు బాగానే ఇష్టపడ్డారు. సినిమా మొత్తం.. కమల్ హాసన్ అలా నెగిటివ్ పాత్రలోనే.. కనిపిస్తే ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. గతంలో కమల్ హాసన్ ఇలానే అభయ్.. అనే సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

మరోవైపు కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే.. ఇలా చాలామంది నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. వారితో పాటు చాలామంది స్టార్లు క్యామియో పాత్రలలో.. కూడా కనిపించారు. అందుకే సినిమా విడుదలకి ముందు.. నుంచి మంచి హైప్ క్రియేట్ చేసుకుంది సినిమా. 

కానీ కేవలం కమల్ హాసన్ పాత్ర మీద సినిమా అంటే తమిళ్ ప్రేక్షకులు ఏమైనా ఆసక్తి చూపిస్తారేమో.. కానీ తెలుగు ప్రేక్షకులలో మాత్రం అంత బజ్ క్రికెట్ అవడం కష్టమే. ఏదేమైనా డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇది కల్కి సినిమాటిక్ యూనివర్స్.. అని ముందే చెప్పారు. కాబట్టి అందులో ఎన్ని భాగాలు ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. పైగా కల్కి 2898 ఏడి సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. కాబట్టి మిగతా సినిమాలపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉంటాయి అని కొందరు చెబుతున్నారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News