Nora Fatehi Beaten Up: చెప్పు దెబ్బలు తిన్న బాహుబలి భామ.. ఎందుకో తెలుసా?

Nora Fatehi Beaten Up With Slippers By Her Mother: డ్యాన్స్ మీద ప్రేమతో నోరా ఫతెహీ చెప్పు దెబ్బలు తిన్నదట. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 17, 2022, 01:08 PM IST
Nora Fatehi Beaten Up: చెప్పు దెబ్బలు తిన్న బాహుబలి భామ.. ఎందుకో తెలుసా?

Nora Fatehi Beaten Up With Slippers By Her Mother : మొరాకో దేశానికి చెందిన నోరా ఫతేహి చిన్ననాటి నుంచి డాన్సర్ కావాలని కలలు కంటూ ఉండేది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం దానికి ఒప్పుకునేవారు కాదట. బుద్ధిగా చదువుకుని ఉద్యోగం చేయమని ఆమెకు ఎప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారట. అయితే తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండదు అనే చందాన నోరా ఫతేహి మాత్రం డ్యాన్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేదట.

అలా ఒకసారి తన తల్లికి తెలియకుండా డాన్స్ చేసి ఆమెకు పట్టు పడడంతో చెప్పు దెబ్బలు కూడా తిన్నానని ఆమె తాజాగా తన ఇంటర్వ్యూలో వెల్లడించింది. నోరా ఫతేహి తెలుగులో టెంపర్, బాహుబలి,,కిక్ 2 వంటి సినిమాల్లో కొన్ని ఐటెం సాంగ్స్ లో నర్తించి మంచి పేరు సంపాదించింది. బాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, నర్తిస్తూ ఆమె మంచి పేరు సంపాదించే ప్రయత్నం చేస్తుంది. అయితే తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ అనే మోసగాడు ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబాన్ని బెదిరించి 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఆ కేటుగాడు మారుపేరుతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి ఇద్దరినీ ట్రాప్ లో పడేసి ప్రేమలో ధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజంగానే అతను ప్రేమిస్తున్నాడని భావించిన ఇద్దరూ అతను ఇచ్చిన గిఫ్ట్ లను కూడా తీసుకున్నారని తెలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) గురువారం బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఆరు గంటలకు పైగా ప్రశ్నించింది.

ఈ విచారణ సమయంలో పింకీ ఇరానీ, నోరా బావమరిది బాబీ కూడా అక్కడే ఉన్నారు. అధికారులు ముందుగా విడివిడిగా, తర్వాత కలిపి ప్రశ్నలు అడిగారట. అందుతున్న సమాచారం మేరకు సుకేష్ నోరా బావమరిది బాబీకి రూ.65 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూను బహుమతిగా ఇచ్చినట్లు తేలింది. బాబీ ఈ విషయాన్ని EOW అధికారుల ముందు ఒప్పుకున్నారు. తాను సుఖేష్ లేదా పింకీని ఎప్పుడూ కలవలేదని, సుకేష్‌తో వాట్సాప్‌లో మాట్లాడేదానినని నోరా ఈఓడబ్ల్యూ విచారణ బృందానికి తెలిపింది.

ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా EOW 8 గంటల పాటు ప్రశ్నించింది. సుకేష్ నుంచి అందిన కానుకలు తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత నెలలోనే, సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన దోపిడీ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఇదే కేసులో నోరా ఫతేహీని కూడా ఈడీ ప్రశ్నించింది.

Also Read: Liger Distrubutors: లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేసిన పూరీ అండ్ కో!

Also Read: Rao Ramesh Great Heart: పర్సనల్ మేకేప్ మేన్ కుటుంబానికి అండగా రావు రమేష్..


 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x