NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నార్త్, సౌత్ తేడా లేకుండా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అభిమానుల్లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్‌ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2024, 08:43 AM IST
NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్యాన్ ఇండియా (భారత్) స్టార్‌గా సత్తా చాటాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్ పండించిన నటనను ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సింది. కానీ నీల్ మాత్రం.. ప్రభాస్‌తో 'సలార్ 2'మూవీ కంప్లీటైన తర్వాత ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

మరోవైపు ఎన్టీఆర్ కూడా దేవర మూవీ తర్వాత వెంటనే వార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. దాంతో పాటు దేవర 2 సినిమా షూటింగ్‌ను ఒకేసారి చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. అందుకు తగ్గట్టు తన డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. ఇక 'వార్ 2' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు లేని కొన్ని సీన్స్ షూట్  చేస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా కియారా పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ కథానాయికగా నటించడం దాదాపు కన్ఫామ్ అయిందని చెబుతున్నారు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈమె హృతిక్ సరసన నటిస్తుందా.. ? లేకపోతే ఎన్టీఆర్‌కు జోడిగా యాక్ట్ చేస్తుందా అనేది చూడాలి. లేకపోతే ఆలియా, కియారా ఇద్దరు నటిస్తారా అనేది చూడాలి.

మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం అనే చెప్పాలి. దీంతో పాటు మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. అటు హృతికో రోషన్.. రీసెంట్‌గా 'ఫైటర్' మూవీతో పలకరించారు. ఈ మూవీ టాక్ బాగున్నా.. అందుకు తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News