Padamati Sandhyaragam: శౌర్య గురించి నిజం చెప్పేసిన ఆద్య.. పెడచెవిన పెట్టి పెళ్లికి సిద్ధమైన రామకు బిగ్‌ ట్విస్ట్‌..

Padamati Sandhyaragam Today December 10 Th Episode: నేటి ఎపిసోడ్‌లో ఆద్య రామకు ఫోన్‌ చేస్తే బిట్టు లేపుతాడు. గబరా పడతూ నేను ఆద్యను అంటుంది. ఆద్య అక్క..నువ్వా? ఇక్కడ పెళ్లిపెట్టుకుని  ఎక్కడకు వెళ్లావు అంటాడు. అదంతా తర్వాత చెబుతా నేను అర్జెంటుగా రామలక్ష్మితో మాట్లాడాలి ముందు ఫోన్‌ ఇవ్వు అంటుంది ఆద్య సరే అని రామ దగ్గరకు వెళ్తాడు బిట్టు.. 

Written by - Renuka Godugu | Last Updated : Dec 10, 2024, 10:50 AM IST
Padamati Sandhyaragam: శౌర్య గురించి నిజం చెప్పేసిన ఆద్య.. పెడచెవిన పెట్టి పెళ్లికి సిద్ధమైన రామకు బిగ్‌ ట్విస్ట్‌..

Padamati Sandhyaragam Today December 10 Th Episode: అద్దం ముందు రామలక్ష్మి ఏడుస్తూ కూర్చుంటుంది. వెళ్లి రామ డోర్‌ కోడతాడు బిట్టు. రామలక్ష్మిక్క ఆద్య అక్క ఫోన్‌ చేసింది. నీతో ఏదో మాట్లాడాలి అంటా మాట్లాడు అని ఫోన్‌ ఇస్తాడు. ఫోన్‌ తీసుకుని లోపలికి వెళ్తుంది. హలో రామ.. రామ నీకోసమే వచ్చా నిజం తెలుసుకున్నాను శౌర్య గురించి చూసింది నమ్మింది అంత అబద్దం రామ అంటుంది. శౌర్యను నీతో విడదీయడానికి అలా చేశారు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే జన్మలో దిద్దుకోలేని తప్పు చేసినట్లు అంటుంది. ప్లీజ్‌ ఆద్య నువ్వు చెప్పకు అంటుంది రామ.. నేను శౌర్య సార్‌ను కలిశాను అని చెప్పబోతుంటే రామ కల్పించుకుని నీ బాధ ఏంటి నేను శౌర్య సార్‌ను వదిలించుకోవడమా? లేదా శ్రీను బావను పెళ్లి చేసుకోవడమా అంటుంది. దీంతో ఒక్కసారిగా షాక్‌ అవుతుంది రామ..

పర్లేదు ఆద్య అమ్మకు నాన్నకు చెప్పలేకపోతే నాకు చెప్పు ఆద్య. బావకు నాకు పెళ్లి అవుతుంటే నీకు బాధగా ఉందా? చెప్పు ఆద్య అని ఏడుస్తూ అడుగుతుంది రామ. నేను అంత చెప్పేస్తా ఈ పెళ్లి ఆపుతా అంతేకాని వేరే ఎవరూ గురించి నువ్వు నాకు చెప్పకు అని ఫోన్‌ కట్ చేస్తుంది రామ. బిట్టు ఇంకొకసారి నా దగ్గరకు ఫోన్‌ తీసుకురాకు అని ఫోన్‌ ఇచ్చేస్తుంది. మళ్లీ రామ కాల్ చేసి.. బిట్టు అంటుంది. మళ్లీ నాకు ఫోన్‌ తీసుకురాకు అన్నది అక్క అంటుంది. అప్పుడు శ్రీనుకు ఫోన్‌ ఇవ్వు అంటుంది. బిట్టు పెళ్లికొడుకు గదికి వెళ్తాడు. అక్కడ అద్దం ముందు కూర్చొని శ్రీను కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది.

అప్పుడే బిట్టు శ్రీను దగ్గరకు వచ్చి ఫోన్‌ ఇచ్చి ఇదిగో మాట్లాడు ఆద్య అక్క లైన్‌లో ఉంది అంటాడు. శ్రీను ఆద్యతో మాట్లాడతాడు. శ్రీను నువ్వు ఈ పెళ్లి చేసుకోకు.. నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకోకు ఏదో ఒకటి చెప్పి ఆపెయ్‌ అంటుంది. ముందే చెప్పాలి ఇప్పుడు కుదరదు అంటాడు. పెళ్లి ఆపమన్నది నాకోసమో నీకోసమో కాదు రామలక్ష్మి కోసం అంటుంది. శౌర్య సార్‌ను అపార్ధం చేసుకుంది అంటుంది. అవును ఇప్పుడు ఆలోచించాల్సింది రామలక్ష్మి శౌర్య ల గురించి శ్రీను ఆద్యల గురించి కాదు. ఈ ఇంటి పరువు గురించి అంటాడు శ్రీను. మావయ్య పేరుప్రతిష్టల గురించి నువ్వు ఎన్ని చెప్పినా ఈ పెళ్లి ఆపలేను. నావల్ల కాదు , నాచేతిలో ఏమి లేదు అని ఫోన్‌ కట్‌ చేస్తాడు శ్రీను.

ఇదీ చదవండి: Padamati Sandhyaragam: ఆదిత్యతో ఆద్య పెళ్లి.. పెదనాన్నకు రిటర్న్‌ గిఫ్ట్‌, వెంకట్రావ్‌ వెకిలివేషాలు..

మళ్లీ పెళ్లి మంటపంలో శ్రీను రామలక్ష్మిలు కూర్చుంటారు.ఇక పిచ్చి వేషాలు వేస్తూ వెంకట్రావ్‌ భార్యకు సైట్‌ కొడుతుంటాడు. అప్పుడు మోషన్‌ ట్యాబ్లెట్స్‌ వేసి శ్రీనుకు ఇచ్చి పెళ్లి ఆపాలని పంతులు వేషంలో ఉన్న వెంకట్రావ్‌. శ్రీనుకు తీర్ధం మాదిరి పోసి తాగమంటాడు. శ్రీను తాగేస్తాడు.ఏంటిది ఇంత చండాలంగా ఉంది అంటాడు శ్రీను. ఇంక తాగను అంటాడు శ్రీను అయితే పెళ్లి జరిపించను అంటాడు. శ్రీను తాగు అని తల్లి అంటుంది. శ్రీనును మొత్తం చెంబు తాగేయ్‌ అంటాడు తల్లి బలవంతం చేయడంతో ఆ నీళ్లు తాగేస్తాడు శ్రీను.

మరోవైపపు కడుపులో గడబిడ మొదలవుతుంది శ్రీనుకు.. వెంకట్రావ్‌ పాటలే పాడుతూ ఉంటాడు. పెళ్లి ఇష్టం లేదు కదా ఆద్య కూడా లేదు కదా అందుకే అలా చేస్తున్నాడు అంటుంది పద్మావతి. శ్రీను లేచి వెళ్తుంటే వెళ్లనివ్వదు తల్లి. అమ్మ బాత్రూమ్‌ వెళ్తా అన్న అస్సలు వినదు. ఇక ప్లాన్‌ బీ అమలు అంటాడు. అత్తయ్యను తగలబెట్టాల్సిందేనా అంటాడు బిట్టు.. కానీ అంటాడు వెంకట్రావ్‌. రేపటి ఎపిసోడ్‌లో రామ శ్రీనుల పెళ్లి ఆగిపోతుందా చూడాలి మరి..

ఇదీ చదవండి: Brahmamudi: రాజ్‌పైకి ధాన్యలక్ష్మి ఉసిగొల్పిన రుద్రాణికి దిమ్మదిరిగే షాక్‌.. ఆస్తి మొత్తం కావ్యకు రాసేసిన తాతయ్య..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News