Ponniyin Selvan OTT Release: పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో

Ponniyin Selvan OTT Release: ప్రముఖ దర్శక దిగ్గజం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వం. రెండు భాగాల్లో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ రెండవభాగం విడుదలై భారీగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2023, 05:13 PM IST
Ponniyin Selvan OTT Release: పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో

Ponniyin Selvan OTT Release: మల్టీ స్టారర్, మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వం అలియాస్ పీఎస్ చిత్రం 1, 2 రెండు భాగాలుగా తెరకెక్కింది. గత ఏడాది విడుదలైన పొన్నియన్ సెల్వం పీఎస్ 1కు సీక్వెల్ పీఎస్ 2 ఇటీవలే ఏప్రిల్ 28న విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

2022లో విడుదలైన పొన్నియన్ సెల్వం మొదటి భాగం చాలా మంచి హిట్ సాధించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్, శరత్ కుమార్ ఇతర నటీ నటులు నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగం గత ఏడాది ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది. అటు ఓటీటీలో కూడా రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ అయింది. తాజాగా పొన్నియన్ సెల్వం  2 ఏప్రిల్ 28వ తేదీన విడుదలై..మొదటి భాగాన్ని మించి హిట్ అయింది. బాక్సాఫీసులు కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా ఖ్యాతినార్జించింది. 

చాలాకాలం తరువాత సినిమా తీసిన మణిరత్నంకు ఇది మరువలేని చిత్రం. చారిత్రక నేపధ్యం కలిగిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. థియేటర్ రిలీజ్ అయి ఇంకా నెల రోజులు కాలేదు. ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. పొన్నియన్ సెల్వం 2 డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ ఏకంగా 120 కోట్లు చెల్లించి తీసుకుంది. త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమౌతోంది.

మరో నాలుగు రోజుల్లో అంటే మే 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో పొన్నియన్ సెల్వం 2 స్ట్రీమింగ్ కానుంది. ప్రారంభంలో రెంటల్ సర్వీస్ ప్రాతిపదికన ఉంటుంది. జూన్ 2వ వారం నుంచి మాత్రం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా అందుబాటులో రానుంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. నౌ..గెట్ రెడీ టు వాచ్ పొన్నియన్ సెల్వన్ 2 ఇన్ అమెజాన్ ప్రైమ్ ఫ్రం మే 26.

Also read: Anchor Suma Ad : సుమ మీద నెటిజన్ల ఆగ్రహం.. అలాంటి వాటిని ప్రమోట్ చేయకంటూ కామెంట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News