Prabhas Upcoming Movies: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైన్ అప్.. అదుర్స్!

ఆదిపురుష్.. రాధేశ్యామ్.. సాహూ వంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాలు నిరాశపరిచిన.. రాబోతున్న సినిమాలు మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్ట్.. రాబోయే సినిమాల వివరాలు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 01:15 PM IST
 Prabhas Upcoming Movies: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైన్ అప్.. అదుర్స్!

Prabhas Upcming Movies List: ప్రభాస్.. మన తెలుగు హీరో.. బాహుబలి పార్ట్-1 మరియు బాహుబలి పార్ట్-2 చిత్రాలతో రికార్డ్ బద్దలు కొట్టి గ్లోబల్ ఫేమ్‌ తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగారు. బాలీవుడ్ టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ మరియు మాలీవుడ్ అంటూ తేడాలు లేకుండా.. అన్ని భాషల బార్డర్ లైన్ తొలగించి సినిమాకి ఎల్లలు లేవని నిరూపించాడు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ప్రేక్షకులను అలరించటానికి వారి అంచనాలను మించి.. అభిమానులకు చేరువ అవ్వటానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాహుబలి తరువాత నటించిన ఆదిపురుష్, రాధేశ్యామ్ మరియు సాహూ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేపోయాయి. కానీ తదుపరి రానున్న చిత్రాలపైన మంచి అంచనాలు ఉన్నాయి. వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ప్రభాస్.. 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో 'సలార్' సినిమా చేస్తున్నారు. Hombale ఫిల్మ్స్ నిర్మించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. 'సలార్' సినిమా పూర్తిగా అండర్ వరల్డ్ నేపథ్యంలో కొనసాగనుంది. 'సలార్' లో ప్రభాస్ ఇంటెన్స్‌గా మరియు మెమోరబుల్ గా ఉంటున్నాడని చిత్ర యూనిట్ తెలియజేసింది. అభిమానులు అంచానాలకు మించి ఈ సినిమా ఉంటుందని.. గ్రిప్పింగ్ స్టోరీలైన్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో ప్రభాస్ తన బెస్ట్ ని ఇచ్చారని చిత్ర యూనిట్ తెలిపింది. 

ఇక ప్రభాస్ నటించబోతున్న మరో సినిమా 'స్పిరిట్'. అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అర్జున్ రెడ్డి లాంటి ఇంటెన్స్ ఎమోషనల్ అండ్ ఆంగ్రీ మెన్ లాంటి పాత్ర ప్రభాస్ చెస్తే.. ఇంకేం ఉంది.. రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే! ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన అన్ని సినిమాలకి ఈ సినిమా భిన్నంగా ఉండనుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. 

Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  

ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం.. 'కల్కి 2898 AD'. మహానటి లాంటి సావిత్రి బయోపిక్ తీసిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొణె వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. విష్ణువు యొక్క పదవ అవతారం నుండి ప్రేరణ పొందినదే ఈ 'కల్కి 2898 AD'. కల్కి పాత్ర పోషిస్తున్న ప్రభాస్.. సంచలనాత్మకమైన స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాతో దీపికా పదుకొనె తెలుగులో ఆరంగ్రేట్రం చేయనుంది. 

ప్రభాస్ నటించబోతున్న మరో సినిమా.. దర్శకుడు మారుతీతో ఉండనుంది. ఈ సినిమా పేరు, నటీనటులు వంటి ఏ ఇతర వివరాలు ఇప్పటి వరకు బయటకి రాలేదు. అన్ని విషయాలు రహస్యంగా ఉంచటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ మారుతీ చేసిన సినిమాలన్నీ మంచి ట్విస్ట్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందించాడు. ఇలాంటి డైరెక్టర్ పాన్ ఇండియా ప్రభాస్ తో చేస్తే.. అదే ఇపుడు ఇండస్ట్రీలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఏది ఏమైనా.. స్క్రీన్ పై వీరి ఇద్దరి కాంబోనేషన్ లో రానున్న సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సిందే!

Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

 

Trending News