Goa Film Festival: ప్రతిష్టాత్మక గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (IFFI) వేదికగా M4M (Motive For Murder) హిందీ ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించారు. ట్రైలర్‌ను ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) వైస్ ప్రెసిడెంట్ అతుల్ విడుదల చేయగా, ఈ కార్యక్రమం గోవా కళా అకాడమీ వేదికపై జరిగింది.
ఈ సందర్భంగా..సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది అని తెలిపారు ..IMPPA వైస్ ప్రెసిడెంట్. అతుల్ మాట్లాడుతూ, M4M హిందీ ట్రైలర్ అద్భుతంగా ఉందని, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్తదని.. ప్రశంసించారు. డైరెక్టర్ మోహన్ వడ్లపట్లను ప్యాన్ ఇండియా స్థాయిలో వినూత్న చిత్రాన్ని తీసుకువచ్చినందుకు అభినందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న.. జో శర్మ ప్రతిభను ప్రశంసించారు.
జో శర్మ.. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జో శర్మ మాట్లాడుతూ..M4M లాంటీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం తనకు గర్వకారణమని.. ట్రైలర్ గోవాలో లాంచ్ కావడం ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని తెలిపింది. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ 110 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలో.. తొలిసారి చూస్తున్నామన్న ఆమె.. దర్శకనిర్మాత మోహన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. M4M చిత్ర కథ యూనివర్సల్‌గా అన్ని భాషల్లోని ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్ అనుభూతిని పంచుతుందని.. "మోటివ్ ఫర్ మర్డర్" తెలిసినప్పుడు ప్రేక్షకుల మైండ్ బ్లో అవుతుందని తెలిపారు.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిన ఈ చిత్రం.. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒడిశా సూపర్ స్టార్ సంబీత్ ఆచార్య, అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సైకో థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్ర.. పాన్ ఇండియా స్థాయిలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తుందని దర్శకుడు చెప్పారు.
ఇది చదవండి: Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్వి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.