పందెం కోడి 2 ట్రైలర్.. మళ్లీ అదే పొగరు, అదే ఎనర్జీ..

పందెం కోడి 2 ట్రైలర్

Last Updated : Sep 29, 2018, 10:39 PM IST
 పందెం కోడి 2 ట్రైలర్.. మళ్లీ అదే పొగరు, అదే ఎనర్జీ..

విశాల్ కెరీర్‌లో 25వ సినిమాగా వస్తున్న పందెం కోడి 2 సినిమా ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. విశాల్‌ తెరంగేట్రం చేసిన మొదట్లో అతడిని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా పందెం కోడికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. అప్పట్లో రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అదే నేపథ్యాన్ని కొనసాగిస్తూ రూపొందింది. పందెం కోడి సినిమాను డైరెక్ట్ చేసిన ఎన్ లింగుసామినే మళ్లీ ఈ సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేశాడు. మొదటి సినిమాలో విశాల్ ఎంత ఎనర్జిటిక్‌గా కనిపించాడో.. మళ్లీ అటువంటి పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో పుష్కలంగానే ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొదటి భాగంలో మీరా జాస్మిన్ విశాల్ సరసన హీరోయిన్‌గా నటించగా ఈ సీక్వెల్లో కీర్తి సురేష్, వరలక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 

విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో కలిసి లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్ అనే మరో మూడు చిత్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

Trending News