Pawan Kalyan Remuneration : ప్రతి సినిమాకు అన్ని కోట్లు ఇవ్వరా?.. రెమ్యూనరేషన్‌పై పవన్ కళ్యాణ్ కామెంట్స్

Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్‌ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్‌ తాజాగా జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్‌ వరకు వస్తుందని చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2023, 12:14 PM IST
  • జనసేన ఆవిర్భావ సభ
  • రెమ్యూనరేషన్‌పై పవన్ కళ్యాణ్‌
  • రోజుకు రెండు కోట్లన్న పవర్ స్టార్
Pawan Kalyan Remuneration : ప్రతి సినిమాకు అన్ని కోట్లు ఇవ్వరా?.. రెమ్యూనరేషన్‌పై పవన్ కళ్యాణ్ కామెంట్స్

Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమా టైంలోనే పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ గురించి ఎక్కువగా చర్చలు జరిగాయి. రోజుకు కోటి, కోటిన్నర, రెండు కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే టాక్ బయటకు వచ్చింది. వకీల్ సాబ్ సినిమా కోసం ఇరవై ఐదు రోజులు పని చేశాడని, యాభై కోట్లు తీసుకున్నాడనే చర్చలు ఎక్కువగా జరిగాయి.

ఇప్పుడు వినోదయ సిత్తం సినిమాకు కూడా అలాంటి టాకే బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఇరవై రోజులు కేటాయించాడని, ఇరవై రోజులకు గానూ నలభై కోట్లు తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రజల ముందు చెప్పాడు. జనసేన పదవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్‌ తన రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చాడు.

 

వెయ్యి కోట్ల ప్యాకేజ్ అంటున్నారని, తాను రోజుకు రెండు కోట్లు సంపాదించే సత్తా ఉందని, తాను ఒక రోజు షూటింగ్‌కు వెళ్తే రెండు కోట్లు వస్తాయని, ఇప్పుడు ఓ సినిమాకు ఇరవై రోజులు కేటాయిస్తే నలభై కోట్లు ఇస్తున్నారని, అది మీరు ఇచ్చిన స్టేటస్ అని చెప్పుకొచ్చాడు. అయితే అన్ని సినిమాలకు అలా ఇస్తారని చెప్పలేను అంటూ మరో మెలిక పెట్టాడు.

అంటే సినిమాను పట్టి రెమ్యూనరేషన్ మారుతుందని అర్థం చేసుకోవచ్చు. హరి హర వీర మల్లు సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు రోజుకు రెండు కోట్ల చొప్పున అంటే ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా రీమేక్‌లు అయితే త్వరగా పూర్తి చేసుకోవచ్చు.. తక్కువ డేట్లు ఇచ్చి ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చే ఉద్దేశంతోనే రీమేక్‌లు చేస్తున్నాడా? అని అంతా అనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, వినోదయ సిత్తం సినిమాలను వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత హరీష్‌ శంకర్, సుజిత్ సినిమాలను పట్టాలెక్కించాల్సి ఉంది. మరి ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో చూడాలి.

Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే

Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News