Bandla Ganesh-PK Movie: ఆశల్లేవ్, పవన్ సినిమా మీద బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు!

Pawan Kalyan Bandla Ganesh project : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన బండ్ల గణేష్ ఆయనతో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినా అది ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 4, 2023, 07:08 PM IST
Bandla Ganesh-PK Movie: ఆశల్లేవ్, పవన్ సినిమా మీద బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు!

Pawan Kalyan Bandla Ganesh project Shelved: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన బండ్ల గణేష్ ఆయనతో మరో సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా బండ్ల గణేష్ మాత్రం తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఎంతకూ డేట్స్ ఇవ్వకపోవడం, బండ్ల గణేష్ కూడా ఒక మంచి సబ్జెక్టును పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకు వెళ్ళ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ గతంలో ఎన్నో సార్లు ప్రచారం జరిగింది. పవన్ వేరే సినిమాలకు ఓపెనింగ్స్ చేస్తున్న సమయంలో బండ్ల గణేష్ తన ఆవేదన బహిరంగంగా వ్యక్తం చేస్తూ వచ్చాడు. విషయం ప్రస్తావించకుండా వేదాంత ధోరణిలో అనేక కామెంట్లు చేస్తూ వచ్చారు.

అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ సినిమా ఆగిపోయిందనే విషయాన్ని బండ్ల గణేష్ ఒప్పుకున్నారు. తాజాగా ఒక నెటిజన్ బండ్ల గణేష్ను పవన్ కళ్యాణ్ గారితో మీరు ఒక మూవీ చేయాలి కదా అది ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్ చేయగా దానికి బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తరువాతి సీఎం అని అందుకే తాను సినిమా చేయడం లేదని చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే  ఎన్బికె షోలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ ఇప్పటివరకు రెమ్యూనరేషన్లు పూర్తిగా ఇచ్చారా అని అడగగా పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే గబ్బర్ సింగ్ సినిమా కైనా ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకున్నది ఇచ్చారు అంటూ మరలా గణేష్ గురించి ప్రస్తావించారు. దీంతో ఒక నెటిజన్ కనీసం సగం అయినా ఇచ్చావా అంటూ బండ్ల గణేష్ ను ప్రశ్నించగా దానికి బండ్ల గణేష్ కి ఏం అర్థమైందో తెలియదు కానీ లవ్ యు బాస్ పవన్ కళ్యాణ్ మీ ప్రేమ అన్ కండిషనర్ అంటూ రాసుకు వచ్చారు.
Also Read: Vani Jayaram Passed Away: కే విశ్వనాద్ మరణం మరువక ముందే మరో విషాదం... రోజుల వ్యవధిలోనే వాణి జయరాం మృతి!

Also Read: Vani Jayaram Death Suspicion: వాణి జయరాం నుదుటిపై గాయాలు... అనుమానాస్పద రీతిలో హాస్పిటల్ కు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News