Bro Prerelease: 'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఆయనే చీఫ్ గెస్ట్.. సోషల్ మీడియాలో వైరల్

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా 'బ్రో'.. నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 25న జరగనుంది. అయితే చీఫ్ గెస్ట్ అతనే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అది ఎంత వరకు నిజమో చూడాలి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2023, 12:13 PM IST
Bro Prerelease: 'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఆయనే చీఫ్ గెస్ట్.. సోషల్ మీడియాలో వైరల్

Bro Prerelease Event: వినోదసిత్తం అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖని, ఇదే సినిమాని తెలుగు లో 'బ్రో' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే!. విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ పతాకం పై టి. జి. విశ్వప్రసాద్, కూచిబొట్ల వివేక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ తన సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ లో తమ్ముడు చిత్రంలోని 'వయ్యారి భామ నీ హంసనడక సాంగ్'లో పవన్ గెటప్ ని  మళ్లీ ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే కామెడీ, ట్విస్ట్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని టీసర్ చూడగానే అర్థమైపోతుంది. జూలై జులై 25 న బ్రో సినిమా శిల్ప కళా వేదికలో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని.. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి అంటూ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం పై నెటిజన్లు స్పందిస్తూ.. అయన సినిమాకి ఆయనే చీఫ్ గెస్ట్ ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం జనసేన వారాహి యాత్రలో చాలా బిజీ గా ఉన్నా పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడం కష్టమే. అయితే హైపర్ ఆది ఈ మద్యే జరిగిన మూవీ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. రెమ్యూనరేషన్ కోసం కాకుండా, రైతులకి సహాయం చెయ్యడానికి పవన్ సినిమాలు తీస్తున్నట్లు తెలిపారు. 

Also Read: Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

మై డియర్ మార్కండేయ అంటూ 'బ్రో' చిత్ర యూనిట్ పాటను రిలీజ్ చెయ్యగానే.. యూట్యూబ్ లో చాలా వ్యూస్ సాధించింది. దీన్నిబట్టి చుస్తే, ప్రేక్షకులు ఈ పాటను చాలా ఎంజాయ్ చేతున్నట్లు తెలుస్తుంది. జులై 28 న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్,బ్రహ్మానందం, తణికెల్ల భరణి నటిస్తుండంతో మెగా అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

Also Read: Woman Killed Occultist: భర్తను వశీకరణం చేసుకునేందుకు పిలిచి మర్డర్ చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News