శ్రీ రెడ్డి‌పై పవన్ కల్యాణ్ అభిమానుల ఫిర్యాదు

ఇటీవల టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎక్కువయ్యాయంటూ నటి శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలు సినీ పరిశ్రమలో అనేక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

Last Updated : Apr 17, 2018, 04:46 PM IST
శ్రీ రెడ్డి‌పై పవన్ కల్యాణ్ అభిమానుల ఫిర్యాదు

ఇటీవల టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎక్కువయ్యాయంటూ నటి శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలు సినీ పరిశ్రమలో అనేక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదంలో పలు సందర్భాల్లో నటి శ్రీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పవన్ కల్యాణ్‌పై చేసిన పలు వ్యాఖ్యలు సైతం పవర్ స్టార్ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ వివాదంతో ఏ విధంగాను సంబంధం లేని పవన్ కల్యాణ్ తల్లిపై సైతం శ్రీ రెడ్డి విమర్శలు చేయడం ఏంటంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై తాజాగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లో జనసేన పార్టీ స్థానిక కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. 

తమ పార్టీ అధినేతపై నోరు పారేసుకున్న సినీ నటి శ్రీ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ కార్యకర్తలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 

Trending News