Perni Nani on VSR: వీర సింహా రెడ్డి డైలాగులపై పేర్ని ఫైర్.. ఆ సంతకం కోసమే ఎదురు చూశారంటూ!

Perni Nani on Veera Simha Reddy Movie: నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాతో సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడమే కాదు ప్రభుత్వం మీద పంచ్ డైలాగులు వేయడంతో సినిమా గురించి పేర్ని నాని స్పందించారు. ఆ వివరాలు

Last Updated : Jan 12, 2023, 10:31 PM IST
Perni Nani on VSR: వీర సింహా రెడ్డి డైలాగులపై పేర్ని ఫైర్.. ఆ సంతకం కోసమే ఎదురు చూశారంటూ!

Perni Nani Comments on Veera Simha Reddy Movie: నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాతో సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదలైన వెంటనే సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా అనేక డైలాగులు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. అధికారంలో ఉన్న వారిని వెధవలతో పోల్చారని కామెంట్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం మీద మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

పవన్ కళ్యాణ్ యువశక్తి సభ గురించి ప్రస్తావించడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని బాలకృష్ణ వీర సింహారెడ్డి డైలాగుల మీద కూడా కౌంటర్లు వేశారు. ఇవన్నీ సినిమా డైలాగులు అని వీళ్లంతా బిల్డప్ బాబాయ్ లని పేర్కొన్నారు. సినిమాలో ఏముందో మాకు తెలియదా అని ప్రశ్నించిన పేర్ని నాని టికెట్లు పెంచుకోవడానికి అనుమతి కావాలని లేఖ పెట్టుకుంటే ఆ సంతకం పెట్టింది ముఖ్యమంత్రి కాదా అని ఎదురు ప్రశ్నించారు. పది రోజులపాటు 20 రూపాయలు పెంచుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు.

ఇక అఖండ రిలీజప్పుడు స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి.. సీఎం జగన్‌తో మాట్లాడాలి అని అడగలేదా? అది మర్చిపోయారా.. జగన్ ఎంత హుందాగా రాజకీయాలు చేస్తున్నారు, కానీ మీరు ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అని నాని ప్రశ్నించారు. ఇక అదే విధంగా జీవో నెంబర్ వన్ రద్దు విషయం మీద మాట్లాడుతూ జీవో నెంబర్ వన్ సదుద్దేశంతో ఇచ్చామని సందుల్లో గొందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తుంటే దాన్ని అరికట్టడం కోసమే జీవో తీసుకువచ్చామని ఇప్పుడు కోర్టు దాన్ని సస్పెండ్ చేసినా మా వాదన కోర్టులో వినిపిస్తామని ఇక్కడి కోర్టులో న్యాయం దొరక్కపోతే పైకోర్టుకు సైతం వెళతామని చెప్పుకొచ్చారు.

ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్దె గదుల అద్దె పెంపు వ్యవహారం మీద ఆయన స్పందిస్తూ తిరుమలలో 7500 గదులు ఉంటాయని అందులో 5000 గదులు ఇవాల్టికి కూడా 50 100 రూపాయలకే అద్దెకిస్తారని అన్నారు. అంతేకాక మరో 15 వేల మందికి ఫ్రీ డార్మెటరీ సౌకర్యం కూడా ఉందని అన్నారు. కేవలం 370 గదులను మాత్రమే విఐపి గెస్ట్ లకు కేటాయించారని వీటిలో 175 నాన్ ఏసీ గదులను ఇప్పుడు అప్డేట్ చేశారని అన్నారు వీఐపీలకు ఇచ్చే 170 గదుల అద్దె పెంచితే ఎందుకు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఈ సందర్భంగా పేర్ని నాని పేర్కొన్నారు. ఇక వెంకటేశ్వర స్వామి కచ్చితంగా వీళ్లందరినీ శిక్షిస్తారని ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. 

Also Read: Buddha Venkanna Counter : వర్మకు విషయం లేదా.. బుద్దా వెంకన్న అంత మాట అనేశాడు ఏంటి?

Also Read: Vijay Craze: తెలుగు రిలీజ్ లేకున్నా విజయ్ జోరు.. 'తునివు'ని వెనక్కు నెట్టి మరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News