Ponniyin Selvan 2 Vs Baahubali 2 : బాహుబలితో పోలిక ఎందుకు?.. ట్విట్టర్ వార్.. కోలీవుడ్‌ మీద టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్

Ponniyin Selvan 2 Vs Baahubali 2 పొన్నియిన్ సెల్వన్ సినిమాను కోలీవడ్‌కు ప్రతీకగా.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఇతర భాషల్లో పొన్నియిన్ సెల్వన్‌కు ఎక్కువగా ఆదరణ దక్కలేదు. మిగతా భాషల్లో డిజాస్టర్‌గా నిలిచింది. అయినా రెండో పార్ట్‌ను మాత్రం ధైర్యంగా రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 01:52 PM IST
  • నెట్టింట్లో మణిరత్నం సందడి
  • పొన్నియిన్ సెల్వన్‌ 2 హల్చల్
  • మణిరత్నం సినిమాపై హైప్
Ponniyin Selvan 2 Vs Baahubali 2 : బాహుబలితో పోలిక ఎందుకు?.. ట్విట్టర్ వార్.. కోలీవుడ్‌ మీద టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్

Ponniyin Selvan 2 Vs Baahubali 2 ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది బాక్సాఫీస్ లెక్కల్లో బాహుబలి కంటే ముందు బాహుబలి తరువాత అన్నట్టుగా మారింది. బాహుబలి సినిమాకు మొదట్లో తెలుగులో నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ తరువాత మెల్లిగా పుంజుకుంది. ఇక నార్త్‌లో అయితే దుమ్ములేపేసింది. పార్ట్ 2 అయితే హిస్టరీలు క్రియేట్ చేసింది. ఆ రికార్డులను ఇప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టడం లేదు. అందుకే హిందీలో పెద్ద సినిమాలు తీసినా, ఏ భాషల్లో పెద్ద చారిత్రాత్మక చిత్రాలు తీసినా కూడా బాహుబలితో పోల్చుకుంటారు.

అలా హిందీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా బోల్తా కొట్టేశాయి. కోలీవుడ్‌లోనూ ఇలాంటి ఓ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అంటూ కల్కి రాసిన నవల ఆధారంగా పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్‌ను తీశాడు. మొదటి పార్ట్‌ను ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే మొదటి పార్ట్ మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు. కేవలం కోలీవుడ్‌లోనే హిట్‌గా నిలిచింది. మిగిలిన అన్ని భాషల్లో నష్టాలను తెచ్చి పెట్టింది.

 

కానీ బాహుబలి విషయంలో మాత్రం రివర్స్ అయింది. టాలీవుడ్‌లో మిక్స్డ్ టాక్ వస్తే.. నార్త్, మిగిలిన భాషల్లో దుమ్ములేపేసింది. ఇక పార్ట్ 2 మీదున్న క్రేజ్ ఆకాశన్నంటిన సంగతి తెలిసిందే. అందరి అంచనాలను మించేలా పార్ట్‌ 2ని రాజమౌళి ప్లాన్ చేశాడు. దీంతో కలెక్షన్ల వర్షం కురిపించినట్టు అయింది. బాహుబలి రెండో పార్ట్‌ దాదాపు పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతుంటాయి. అయితే మణిరత్నం ఇప్పుడు ఈ పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్‌ మీద అంచనాలను క్రియేట్ చేయలేకపోయాడు.

Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ మీద కోలీవుడ్‌ కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బాహుబలి 2 కంటే పొన్నియిన్ సెల్వన్ 2 బాగుందని ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీంతో కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ మాటల యుద్దం మళ్లీ మొదలైంది. నిజంగానే బాగుంటే.. కలెక్షన్ల వస్తాయా? లేదా? అన్నది చూద్దాం. బాహుబలి 2 కలెక్షన్లను బ్రేక్ చేసి చూపెట్టమనండి అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్.. కోలీవుడ్‌కు సవాళ్లు విసురుతున్నారు. మరి పొన్నియిన్ సెల్వన్ 2 వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News