Pooja Hegde Next Film: ఒక లైలా కోసం ముకుందా శాంతి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. హరీష్ శంకర్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం చిత్రంతో టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభ దశలో కాస్త తడబడిన.. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోగలిగింది. మీడ్ రేంజ్ హీరోలతో సమానంగా మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకునేది పూజా.
ఒక టైం లో అయితే ఏ సినిమా పోస్టర్ మీద చూసిన పూజా ఫోటో ఖచ్చితంగా కనిపించేది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా గుంటూరు కారం మూవీ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉంది.
మొదట గుంటూరు కారం లో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నిర్ణయించబడిన.. సడన్ గా ఆ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతోపాటు మరికొన్ని ప్రాజెక్టుల నుంచి కూడా పూజ సైడ్ అయింది. తెలుగులో చాలావరకు పూజా వదులుకున్న మూవీస్ శ్రీలీల ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో పూజ చేతిలో సాలిడ్ గా ఉన్న ఒకే ఒక ప్రాజెక్ట్ సాయిధరమ్ తేజ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న గంజా శంకర్ మూవీ.
అయితే రీసెంట్ టాక్ ప్రకారం పూజ ఆ మూవీ నుంచి కూడా తప్పుకుందట. ఇప్పుడు ఈ వార్త అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఇంతకీ పూజ ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే.. ఈ స్టోరీలో ఆమె చేయబోయే పాత్ర ఆమెకు నచ్చకపోవడం వలన అని తెలుస్తోంది. ఈ మూవీలో పూజ చేయబోయే పాత్ర ఎప్పుడు తెల్లచీర ధరించి ఎక్కువ సమయం జైల్లో కనిపిస్తుందట. ఇటువంటి డీ గ్లామర్ పాత్ర నటించిడం ఇష్టం లేక పూజ మూవీ నుంచి తప్పకుందట.
అయితే లాస్ట్ ఇయర్ షారుక్, దీపిక నటించిన జవాన్ చిత్రంలో ఆల్మోస్ట్ దీపిక చాలా వరకు ఇలాంటి డీ గ్లామర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ నేపథ్యంలో పూజ ఈ పాత్ర చేసినట్లయితే ఆమెకు మరింత పాపులారిటీ వచ్చేదేమో అన్న అభిప్రాయాలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి . పూజా.. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ తో మరొక మూవీ చేస్తోంది. మరి ఈ బుట్ట బొమ్మ నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటుందో చూడాలి.
Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook