Ravanam Movie : ప్రభాస్‌ ప్రశాంత్ నీల్ కాంబో రిపీట్.. దిల్ రాజు భారీ ప్లానింగ్

Dil Raju Prabhas Movie దిల్ రాజు ప్రభాస్‌, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్‌లతో సినిమాలు ప్లాన్ చేశానని ఇది వరకే చెప్పాడు. అందులో ఆల్రెడీ రామ్ చరణ్‌తో ఓ సినిమా నడుస్తోంది. ఇక బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 10:18 AM IST
  • వేగంగా కదులుతోన్న సలార్ యూనిట్
  • భారీ బడ్జెట్‌ చిత్రాలతో బిజీగా దిల్ రాజు
  • సలార్ తరువాత రవణం అంటూ ప్రభాస్?
Ravanam Movie : ప్రభాస్‌ ప్రశాంత్ నీల్ కాంబో రిపీట్.. దిల్ రాజు భారీ ప్లానింగ్

Prabhas Prashanth Neel Dil Raju Ravanam ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలిసి ఇప్పుడు సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది రెండు పార్టులుగా వస్తుందనే ప్రచారం కూడా ఒకటి ఉంది. ఫ్రాంచైజీలా ఈ సినిమాలు ఉంటాయని రూమర్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మాత్రం మేకర్ల నుంచి సరైన ప్రకటన ఒక్కటి కూడా రాలేదు. కానీ తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. సలార్ తరువాత మళ్లీ వెంటనే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారట.

ప్రభాస్ అసలే ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్‌ విడుదలకు రెడీగా ఉంది.. మారుతి సినిమా ఫుల్ స్వింగులో నడుస్తోంది.. సలార్ సినిమా కూడా సెట్స్ మీదుంది. ప్రాజెక్ట్ కే అయితే నిరంతరం సాగుతూనే ఉంది. ఇవి కాకుండా ప్రభాస్ ఇంకా స్పిరిట్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇవి కాకుండా ప్రభాస్ మైత్రీ మూవీస్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ కాంబోలో మైత్రీ ఓ సినిమాను నిర్మించనుందని ఈ మధ్యే ప్రకటించింది.

ఇప్పుడు దిల్ రాజు కూడా తన సినిమాను ప్రకటించాడు. ప్రశాంత్ నీల్‌తో రవణం అనే సినిమా ఉంటుందని చెప్పాడు. అంటే అది ప్రభాస్ కోసమే అని అంతా ఫిక్స్ అయ్యారు. మళ్లీ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోను దిల్ రాజు సెట్ చేసినట్టు అయింది. అసలే ఇప్పుడు దిల్ రాజు అన్నీ కూడా పాన్ ఇండియన్ రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నాడు. మన హీరోలు పక్క భాషల డైరెక్టర్లు.. పక్క భాషల హీరోలతో మన డైరెక్టర్లను కలిపేస్తున్నాడు.

దిల్ రాజు ఇప్పుడు శంకర్ రామ్ చరణ్‌ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇక సమంత శాకుంతలం సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నాడు. దిల్ రాజు రానున్న కాలంలో ఇంద్రగంటి మోహనకృష్ణ, శైలేష్ కొలను వంటి వారితోనూ సినిమాలు చేయబోతోన్నట్టుగా ప్రకటించాడు.

Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?

Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News