Salaar Kali Matha: అఖండ, కార్తికేయ 2 బాటలోనే సలార్.. గట్టిగానే ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్?

Salaar to Have a Devotional Touch: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 16, 2022, 06:14 PM IST
Salaar Kali Matha: అఖండ, కార్తికేయ 2 బాటలోనే సలార్.. గట్టిగానే ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్?

Salaar to Have a Devotional Touch with Kali Matha Story: గత ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా అలాగే ఈ ఏడాది నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన  కార్తికేయ 2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ దైవత్వం. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో శివ తత్వాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేయగా కార్తికేయ 2 సినిమాలో కృష్ణ తత్వాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్.

ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా దాదాపు ఇలాంటి ప్రయత్నం జరుగుతోందని వాదన వినిపిస్తోంది.  సలార్ సినిమాలో డివోషనల్ టచ్ ఉంటుందని, కాళి మాత ప్రస్తావన సహా కాళీ మాత్ర విగ్రహం చుట్టూ కాసేపు కథ తిరుగుతుందని అంటున్నారు. ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా మారి కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ఈ సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారం సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ అనే ఒక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో భాగంగా ఒక కాళికామాత విగ్రహం చుట్టూ కాస్త కథ అల్లుకున్నారని ఆ కథ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందని కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులందరూ సినిమాను ఆదరిస్తారని మేకర్స్ భావిస్తున్నారు.

వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ మీద ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతుందనే ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగానే ప్రభాస్ లుక్ అలాగే తాజాగా విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రెండూ కూడా దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఏదో కొత్తగా ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజమవుతాయి అనేది.
Also Read: Balakrishna Flirting: హీరోయిన్ తో బాలయ్య పులిహోర.. నువ్ చందమామ నేను చీకటి.. కలిస్తే పున్నమిరాత్రే అంటూ!

Also Read: Sushanth Singh Rajput Friend Died: స్నేహితుడి బాటలోనే సూసైడ్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్ మృతి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x