Kalki2898AD: పెళ్లి అందుకే చేసుకోలేదు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Kalki2898AD pre-release event: కల్కి 2898 AD లోని బుజ్జిని నిన్న పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మరి రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 23, 2024, 08:42 AM IST
Kalki2898AD: పెళ్లి అందుకే చేసుకోలేదు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Kalki Prabhas: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. కాగా నిన్న బుధవారం నాడు కనీవినీ ఎరుగని రీతిలో.. ఈ సినిమాలోని రోబో బుజ్జిని  గ్రాండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మరీ విడుదల చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 50 సెకన్ల నిడివితో ఉన్న బుజ్జి టీజర్ కూర మూవీ యూనిట్ విడుదల చేశారు. ముందుగా ఈ టీచర్ గురించి గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘మా బక్క డైరెక్టర్.. ఈ బుజ్జితో నన్ను చాలా రోజులు టార్చర్ పెట్టాడు. నాతో మూడు సంవత్సరాలు సినిమా తీసి.. 50 సెకన్ల టీజర్ చూపిస్తారా? ఏంటి సార్ ఇదీ.. మిమ్మల్ని కొత్తాలి.. నేనేదో నా డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి.. వెళ్లిపోదాం అంటే.. నాతో ఇవేవో కార్లు, ఫీట్లు చేయిస్తున్నాడు. నేను కూడా ఈ సినిమా కోసం మీలాగే ఎదురుచూస్తున్నాను. మా బుజ్జి బ్రెయిన్ కంటే బాడీనే బెటర్. అది నా బుర్రమొత్తం తినేసింది,” అంటూ చెప్పుకొచ్చారు

ఆ తరువాత ఈ సినిమాలో నటించిన స్టార్ క్యాస్ట్ గురించి మాట్లాడుతూ..” నాకు ఈ చిత్రంలో అమితాబ్, కమల్ సార్‌లతో కలిసి వర్క్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. కమల్ సార్‌కి వంద దండాలు.. థాంక్యూ సార్. ప్రపంచం మొత్తం అమితాబ్, కమల్‌‌ని చూసి ఇన్స్‌పైర్ అవుతారు. అలాంటి వాళ్లతో నేను వర్క్ చేసే అవకాశం నాకు వచ్చిందంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సౌత్‌లో ఇంతమంది ఫ్యాన్ బేస్‌ని సంపాదించడం అంటే అది ఒక్క అమితాబ్ సార్‌కే సాధ్యం అయ్యింది. ఇక కమల్ సార్ సినిమాలు నేను ఎంతగానో చూసేవారిని.. ముఖ్యంగా సాగరసంగమం సినిమా చూసి నాకు అలాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. ఆయన చేసినట్టుగా హెడ్ నాకు కదలడం లేదని మా అమ్మని అడిగాను,” అని తెలియజేశారు.

“ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఆయనకి డబ్బు అంటే భయం లేదు. చాలా కాస్ట్లీ ఫిల్మ్ తీసినా.. ఇంకా ఏం చేయాలి.. ఇంకా ఇంకా అంటూనే ఉంటారు. 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్నది ఆయనొక్కరే. ఆయన రెండో సినిమానే ఎన్టీఆర్‌తో చేశారంటే.. ఆయన రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. లక్కీగా ఆయనకి ఇద్దరు బ్యూటిఫుల్ డాటర్స్ ఉన్నారు. వాళ్ల ఫాదర్ ఎంత డేరింగ్‌గా ఉంటారో.. వీళ్లు కూడా అంతే,” అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్.

కాగా యాంకర్ సుమ ఈమధ్య ప్రభాస్.. లైఫ్ లో ఒక్కరు స్పెషల్ రాబోతున్నారు.. అని షేర్ చేసిన ట్వీట్ గురించి మాట్లాడుతూ.. మీరు అలా అనే లోపల అమ్మాయిలకు హార్ట్ ఎటాక్ వచ్చింది అంటూ జోక్ వేసింది. అయితే వెంటనే ప్రభాస్ ఆ అమ్మాయిల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు అని ఎంతో తమాషాగా జవాబు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also read: IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News