Prakash Raj vs Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూ వివాదం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోవడమే సంచలనంగా మారింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉండగా.. దీనిని రాజకీయం చేయొద్దని, మతకల్లోలాలు సృష్టించోద్దు అంటూ పవన్ కళ్యాణ్ పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కామెంట్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా ఇన్ డైరెక్ట్ గా పదేపదే ఎక్స్ ద్వారా టార్గెట్ చేయడానికి కొంతమంది తీవ్రంగా తప్పుబట్టారు కూడా.. కొందరు ఈ సమయంలో ప్రకాష్ రాజ్ కి మద్దతుగా కూడా నిలుస్తున్నారు. ఇటీవల చేయని తప్పుకు కార్తీతో కూడా క్షమాపణలు చెప్పించారు అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా తిరుపతి లడ్డూ లో ఎటువంటి కల్తీ లేదు అని అనవసర ప్రచారాలు చేయకండి అంటూ కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరొకసారి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విరుచుకుపడుతూ కామెంట్లు చేశారు. దీంతో ప్రకాష్ రాజ్.. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా.. ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ మరో ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ గురించి అని , దీక్షలు చేయడం మానేసి పరిపాలనపై దృష్టి పెట్టాలంటూ పరోక్షంగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ కామెంట్ వేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే లడ్డూ వివాదం గురించి ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంలో మెట్లు శుభ్రం చేసి, పసుపు కుంకుమ బొట్లు కూడా ఆయన పెట్టారు. అసలు తప్పు జరిగిందా? లేదా? అనేది నిర్ధారణ కాకుండా దీక్షల పేరుతో గుడిమెట్లను శుభ్రం చేసి, నానా హడావిడి చేసిన తీరుపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడడం మా ప్రభుత్వ లక్ష్యం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఫైర్ అవుతున్నారు.. అందుకే ప్రతిసారి పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులను కూడా రెచ్చగొడుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను భారీగా టార్గెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
Read more: Tirumala Laddu Row: పవన్ అసలైన సెక్యులర్.. లడ్డు వివాదం వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.