Puri Jagannadh News: ముంబై రోడ్లపై దర్శకుడు పూరీ జగన్నాథ్​కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే?

Puri Jagannadh News: దర్శకుడు పూరీ జగన్నాథ్​కు ముంబైలో ఓ వింత అనుభవం ఎదురైంది. ముంబైలో తన కారులో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ తెలుగు కుర్రాడు గుర్తుపట్టాడు. కారు వెనుక టీఎస్ రిజిస్ట్రేషన్ ఉండటంతో.. లోపల పూరీ జగన్నాథ్​ (Puri Jagannadh News) కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 10:59 AM IST
Puri Jagannadh News: ముంబై రోడ్లపై దర్శకుడు పూరీ జగన్నాథ్​కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే?

Puri Jagannadh News: వెండితెరపై కనిపించి అలరించే తమ అభిమాన నటుల్ని, తెర వెనుక సినిమా కోసం కష్టపడే దర్శకుల్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని, కలుసుకోవాలని ఫ్యాన్స్​ ఉవ్విళ్లూరుతుంటారు. అలా తమ అభిమానించే (Puri Jagannadh Fans) వ్యక్తులను కలిసేందుకు అవకాశం అనుకోకుండా వస్తే? ఆ సెలబ్రిటీలు అకస్మాత్తుగా ఎదురైతే? ఆ భావాన్ని మాటల్లో చెప్పలేం. కానీ, వారిచ్చిన ఆటోగ్రాఫ్‌, వారితో దిగిన సెల్ఫీలను మనకు తెలిసిన వారికి చూపించి ఆనందాన్ని పంచుకుంటుంటాం. మరి మనం ఎంతగానో ఆరాధించే దర్శకుడ్ని కలిసి, తనతో ఫొటో దిగలేకపోతే.. ఫొటో తీసుకునేందుకు మన దగ్గర ఫోన్‌ లేకపోతే? ఎంత బాధగా ఉంటుంది!

ఇలాంటి అనుభవమే ఎదురైంది ప్రమోద్‌ అనే కుర్రాడికి. తను అభిమానించే టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ని (Puri Jagannadh News) అనుకోకుండా కలిశాననే అమితానందం ఉన్నా ఆయనతో సెల్ఫీ తీసుకోలేకపోయాననే బాధే తనలో ఎక్కువగా కనిపించింది. ముంబయిలో జరిగిన ఈ దృశ్యాన్ని నటి, ఛార్మి సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్‌ చేశారు.

ముంబైలో తన కారులో పూరీ జగన్నాథ్​ వెళుతున్న క్రమంలో ప్రమోద్​ అనే తెలుగు కుర్రాడు గుర్తుపట్టాడు. కారు వెనుక టీఎస్ రిజిస్ట్రేషన్ ఉండటంతో.. తెలుగువాళ్లు ఉంటారని కారు లోపలికి చూశాడు. లోపల పూరీ జగన్నాథ్​ కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. కాసేపు ఆ కుర్రాడికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆపై తాను పూరికి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. పూరి అతడితో కాసేపు ముచ్చటించి.. వివరాలు తెలుసుకున్నాడు. బాగా చదువుకోవాలని సూచించాడు. ఆ కుర్రాడు కారులో ఉన్న చార్మీని కూడా పలకరించాడు.  

"పూరి జగన్నాథ్‌ ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగింది. అదే సమయంలో అటుగా వెళ్తోన్న ప్రమోద్‌ అనే అబ్బాయి పూరి జగన్నాథ్‌ని కలిసి, కాసేపు మాట్లాడాడు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ప్రమోద్‌ దగ్గర ఫోన్‌లేదు. తన కోసమే ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నా" అని తెలిపారు. దీన్ని చూసిన సినీ ప్రముఖులు, పూరి జగన్నాథ్‌ అభిమానులు (Puri Jagannadh Fans) ఆయన్ను ప్రశంసిస్తున్నారు. పూరి జగన్నాథ్‌- ప్రమోద్‌ మధ్య సాగిన ఆ సంభాషణ ఏంటో మీరే చూడండి..     

Also Read: Aryan Khan Drugs Case: బాలీవుడ్‌లో వివాదం రేపుతున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు

Also Read: Romantic Badass Trailer: రొమాంటిక్ మూవీ నుంచి మరో ట్రైలర్.. యూత్‌కి హీటెక్కించే సీన్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News