Allu Arjun: యంగ్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన బన్నీ.. అసలేమైందంటే..?

Allu Arjun warns young actress: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో  సినిమా అంటే ఎలాంటి వారైనా సరే ఎగిరి గంతేస్తారు. అలాంటిది శ్రీ లీల అవకాశం వచ్చినా సరే రిజెక్ట్ చేయడంతో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా శ్రీ లీల కి ఫోన్ చేసి మరీ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం..  

Written by - Vishnupriya | Last Updated : Nov 6, 2024, 03:43 PM IST
Allu Arjun: యంగ్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన బన్నీ.. అసలేమైందంటే..?

Allu Arjun warns Sreeleela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో హవా కొనసాగిస్తూ దూసుకుపోతోంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న అన్ని చిత్రాలు మరే  హీరోయిన్ చేతిలో లేవనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు హీరో అల్లు అర్జున్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ, దానిని రిజెక్ట్ చేసింది అనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source

అసలు విషయంలోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2  సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ సినిమాలో కూడా శ్రీ లీల నే మొదట హీరోయిన్ గా అనుకున్నారట మేకర్స్.  అయితే శ్రీ లీలా మాత్రం అల్లు అర్జున్ సినిమాకు  డేట్స్ కాళీ లేక వదులుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

కథ నచ్చినప్పటికీ,  అందులోను ఐకాన్ స్టార్ తో సినిమా అనేసరికి ఎగిరి గంతేసిందట. కానీ డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లే ఈ సినిమా కథను వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం. 

ఇకపోతే ఈ విషయంపై అల్లు అర్జున్ శ్రీలీలకు ఫోన్ చేసి మాట్లాడారని వార్తలు వినిపిస్తున్నాయి.  నా సినిమానే రిజెక్ట్ చేస్తావా అంటూ తనదైన శైలిలో బన్నీ శ్రీలీలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట.  అంతేకాదు శ్రీ లీలా కి అల్లు అర్జున్ స్వయంగా ఫోన్ చేయడంతో ఇక ఆమె అన్నింటినీ పక్కన పెట్టి ఆయన కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. 

ఏది ఏమైనా అల్లు అర్జున్, శ్రీ లీల కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.  మరోవైపు పుష్ప -2  సినిమాలో అల్లు అర్జున్ సరసన ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంది.. గతంలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పేరు వినిపించాయి. కానీ అందరూ కూడా రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయడంతోనే ఇప్పుడు శ్రీ లీలను ఫైనల్ చేసినట్లు సమాచారం..

 

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News