Jigarthanda Double X: ఓటీటీలోకి వచ్చేసిన 'జిగర్ తండ డబుల్ ఎక్స్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Lawrance Movie: తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు నయా మూవీ వచ్చేసిన 'జిగర్ తండ డబుల్ ఎక్స్'. లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 04:44 PM IST
Jigarthanda Double X: ఓటీటీలోకి వచ్చేసిన 'జిగర్ తండ డబుల్ ఎక్స్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jigarthanda Double X OTT: రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్ తండ డబుల్ ఎక్స్'. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించారు. ఢిపరెంట్ కథలను టేకాఫ్ చేయడంలో కార్తీక్ సుబ్బరాజు ముందుంటాడు. 'జిగర్‌ తండ'’కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 

తాజాగా ఈ యాక్షన్‌ కామెడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నేటి(డిసెంబర్‌ 8) నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఈ మూవీ ఇంగ్లిషులో కూడా స్ట్రీమింగ్ కు రానుంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న లారెన్స్ కు ఈ మూవీకి మంచి బూస్టాప్ ఇచ్చిందనే చెప్పాలి. 

చాలా కాలం తర్వాత చంద్రముఖి 2 ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు లారెన్స్. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలకపాత్రలో నటించింది. చంద్రముఖి తరహాలోనే ఈ సినిమా ఉండటం వల్ల తెలుగు ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. మరోవైపు ఎస్జే సూర్య విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోనితో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చిన సూర్య.. మరోసారి జిగర తండాలో తన నటనతో అలరించాడు. 

Also Read: Fighter teaser: హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ ‘ఫైటర్' ‌టీజ‌ర్.. గాల్లో హై వోల్టేజ్ యాక్షన్ అదిరింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News