Raj Tarun - Lavanya: సూసైడ్ నోట్ రాసిన లావణ్య.. ఆమె పేరే హైలెట్..!

Lavanya Sucide Note: మాల్వి మల్హోత్ర తన చావుకు ప్రధాన కారకురాలు.. అలాగే రాజ్ తరుణ్,  వారి తల్లిదండ్రులు నా మరణాన్ని కోరుకుంటున్నారు.. ఈ మాయ ప్రపంచంలో నేను బ్రతకలేను.m అంటూ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య సూసైడ్ నోట్ రాసింది. 

Written by - Vishnupriya | Last Updated : Jul 13, 2024, 09:20 AM IST
Raj Tarun - Lavanya: సూసైడ్ నోట్ రాసిన లావణ్య.. ఆమె పేరే హైలెట్..!

Raj Tarun - Lavanya: రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకొక వార్త అటు ఆడియన్స్ ను..   ఇటు ప్రజలను కూడా ఆశ్చర్యాలకు గురిచేస్తోంది.. 11 ఏళ్ల ప్రేమాయణంలో తనతో సహజీవనం చేసి రహస్యంగా పెళ్లి చేసుకొని.. రెండుసార్లు గర్భవతిని చేసి ఆఖరికి అబార్షన్ చేయించాడు అంటూ పోలీసుల ముందు తన ఘోడు ను వెల్లబోసుకున్న రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య.. ఇప్పుడు తాజాగా సూసైడ్ నోటు రాసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. అంతే కాదు తన చావుకు కారణం హీరోయిన్ మాల్వి మల్హోత్రా అంటూ  హాట్ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ. 

Add Zee News as a Preferred Source

వైరల్ గా మారిన లావణ్య సూసైడ్ నోట్..

మాల్వి మల్హోత్రా ప్రేమలో పడి రాజ్ తరుణ్ తనకు అన్యాయం చేశాడని.. రాజ్ తరుణ్ లేని జీవితాన్ని ఊహించుకోలేనని.. అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నం చేసింది లావణ్య.. తాజాగా అర్ధరాత్రి సమయంలో తన అడ్వకేట్ తో చాటింగ్ కూడా చేసింది..  నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. ఈ లోకంలో ఇక నా పయనం పూర్తి అయింది.. అందుకే నేను వెళ్ళిపోతున్నాను.. అసలు నేనేంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు పడుతున్నారు.. కానీ నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలుస్తున్నారు.. ఈ లోకం అనేది ఒక మాయ.. ఈ మాయా ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ చేతిలో అత్యంత దారుణంగా మోసపోయాను.. అతడి మైండ్ గేమింగ్ , నాపై వస్తున్న గాసిప్స్ తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను ఒక కీలుబొమ్మను అయ్యాను.. ప్రతిదీ కూడా ఒక పథకం ప్రకారమే జరిగిపోయింది.. 

ఇక నా భర్తను విడిచి ఉండలేకపోతున్నాను.. నా భర్త నాకు కావాలి అని, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాను  బ్రతిమలాడితే ఆమె వినిపించుకోకపోగా, తన సోదరుడితో కలిసి చంపేస్తానని బెదిరిస్తోంది. నా చావుకి ప్రధాన కారకురాలు మాల్వి మల్హోత్రా. అయితే మరొక కారణం రాజ్ తరుణ్ , ఆయన తల్లిదండ్రులు.కనీసం నాకు తినడానికి తిండి లేదంటూ మొత్తుకుంటున్నా.. రాజ్ తరుణ్, మాల్వి ఎంజాయ్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ ఆమె మోజులో పడి మారిపోయి.. నా మరణాన్ని కోరుకుంటున్నాడు. అందుకే ఈ లోకం నుంచి విడిచి వెళ్లిపోతున్నాను అంటూ ఒక సూసైడ్ లెటర్ రాసి అడ్వకేట్ తో చాట్ చేసింది..

లావణ్యను రక్షించి,  కౌన్సిలింగ్ ఇచ్చిన నార్సింగి పోలీసులు..

అంతేకాదు అదే సమయంలో.. 112 కి డయల్ చేసింది ..ఇక ఈ విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటిన లావణ్య ఇంటికి చేరుకొని ఆమెను రక్షించి.. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు. మొత్తానికైతే లావణ్య సూసైడ్ నోటు ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News