నలభీమపాకం.. రాజేంద్రుడి సొంతం

  

Last Updated : Nov 10, 2017, 06:09 PM IST
నలభీమపాకం.. రాజేంద్రుడి సొంతం

టాలీవుడ్ హాస్య నటుడు రాజేంద్రప్రసాద్‌లో గొప్ప నలుడు, భీముడు దాగి ఉన్నారని అంటున్నారు నిర్మాత అనిల్‌ సుంకర. ఎందుకంటే ఇప్పుడు ఆయన వంటమాస్టారి అవతారం ఎత్తారట..  రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజుగాడు’ సినిమా షూటింగ్ దగ్గర జరిగింది ఈ ముచ్చట.  రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సరదాగా వంట చేశారు నటకిరీటి. ఇదే విషయాన్ని అనిల్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంటూ ఫోటోలు కూడా పోస్టు చేశారు.  ‘రాజేంద్రుడు సెట్‌లో ఉంటే నవ్వుకే కాదు.. విందుకు కూడా ఏ లోటు ఉండదు. రాజ్‌తరుణ్‌ చూడండి.. దొంగలా ఆ పసందైన వంటకాలను ఎలా దొంగిలించాలా అని ఆలోచిస్తున్నాడు’ అని కామెడీగా ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌కు రాజ్‌తరుణ్‌ బదులిస్తూ.. ‘రాజేంద్రప్రసాద్‌ సార్‌‌తో పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. చాలా సరదాగా కాలం గడిచిపోతుంది. ఆయన చేసిన వంటకాలను దొంగలించాలనుకున్నాను.  కానీ ఆయనే స్వయంగా వండి పెట్టారు. చాలా రుచికరమైన భోజనం అది ’ అని తెలిపారు. గతంలో రాజేంద్రప్రసాద్ నటించిన "క్విక్ గన్ మురుగన్" సినిమా నేపథ్యం కూడా శాకాహార వంటల మీద సాగుతుంది. శాకాహారాన్ని ప్రచారం చేస్తూ.. నాన్ వెజ్ దోశలకు వ్యతిరేకంగా పోరాటం చేసే కామెడీ కౌబాయ్ పాత్రను రాజేంద్రప్రసాద్ అందులో పోషించారు. అయితే రాజుగాడు సెట్‌లో ఆయన చేసింది శాకాహారమో.. మాంసాహారమో తెలియదు. 

 

 

Trending News