Rajinikanth Lal Salaam : కూతురి కోసం ఆ పని చేస్తోన్న రజినీకాంత్.. ఐశ్వర్య ప్లానింగ్ మామూలుగా లేదు

Lal Salam Movie రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. విష్ణు విశాల్ హీరోగా లాల్ సలామ్ అనే సినిమాను ఐశ్వర్య తీయబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 11:47 AM IST
  • ఐశ్వర్య రజినీకాంత్ కొత్త సినిమా
  • లాల్ సలామ్‌లో రజినీ స్పెషల్ రోల్
  • కూతురి కోసం తలైవార్ ముందడుగు
Rajinikanth Lal Salaam : కూతురి కోసం ఆ పని చేస్తోన్న రజినీకాంత్.. ఐశ్వర్య ప్లానింగ్ మామూలుగా లేదు

Rajinikanth Lal Salaam : సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శుక్రవారం నాడు లైకా సంస్థ ఓ ట్వీట్ వేసింది. తమ కొత్త సినిమా అప్డేట్ రాబోతోందని లైకా వేసిన ట్వీట్‌తోనే రజినీకాంత్ సినిమా మీద గాసిప్స్ మొదలయ్యాయి. రజినీకాంత్‌తోనే సినిమా తీయబోతోందని, అందుకే లైకా ఇలా ట్వీట్ వేసిందని అందరూ అనుకున్నారు. వాటికి తగ్గట్టుగానే ఇప్పుడు అప్డేట్ వచ్చింది. లైకా ప్రొడక్షన్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ చిత్రం అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

లాల్ సలామ్ సినిమాను ఐశ్వర్యా రజనీకాంత్ తెరకెక్కిస్తోంది. అయితే ఈ కథలోని ముఖ్య పాత్రలో తన తండ్రి నటించాలని కోరినట్టుంది ఐశ్వర్య. దీంతో కూతురి కోసం స్పెషల్ పాత్రలో నటించేందుకు రజినీ ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటస్తుండగా.. రజినీకాంత్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను లైకా ట్వీట్ చేసింది.

కూతురి కోసం ఇలా రజినీకాంత్ సహాయక పాత్రలు చేసేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ రోల్ ఎలా ఉంటుందో చూడాలి. లాల్ సినిమా గురించి విష్ణు విశాల్ ట్వీట్ వేస్తూ.. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ సర్..  మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సర్.. ఐశ్వర్య స్క్రిప్ట్.. లైకా నిర్మాణం అంటూ విష్ణు విశాల్ పొంగిపోయాడు.

 

ఐశ్వర్య రజనీకాంత్ మాత్రం తన సినిమా కోసం భారీ ప్రణాళికలే వేసింది. తండ్రిని స్పెషల్ రోల్‌కు ఒప్పించింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏ ఆర్ రెహమాన్‌ను తీసుకుంది. లైకా అయితే భారీ స్థాయిలో నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ లాల్ సలామ్ సినిమా ఐశ్వర్య కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

Also Read : దేవీ నువ్వు మగాడివేనా.. దమ్ముంటే ఆ పని చెయ్.. లైవ్ డిబేట్లో రెచ్చిపోయిన చిట్టిబాబు

Also Read : RC 16 కోసం భారీ ప్లాన్.. చేతులు కలిపిన సుకుమార్ అభిషేక్ అగర్వాల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News