Raju Srivastav Dead: ప్రముఖ కమెడియన్ రాజశ్రీ వాస్తవ(58) మరణించారు. ఆగస్టు 10న ఆయన జిమ్లో వర్కర్ చేస్తుండగా..గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రిలో చేరాడు. అప్పటినుంచి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం (బుధవారం) కన్నుమూశారు. 1980లో ఆయన సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అంతేకాకుండా ఆయనకు స్టాండప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించింది.
కామెడీ మంచి పేరు తెచ్చుకున్నాడు. గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు రాజ శ్రీవాస్తవ. ఆయన మరణ వార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజ శ్రీవాస్తవకు చిన్న తనం నుంచే సినిమాలు అంటే ఇష్టం ఉండడంతో చిన్న వయసు నుంచే టీవీ సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత ప్రముఖ షో "ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్"తో విశేష గుర్తింపు పొందారు. ఈ సిరీస్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో చాలా మంది ప్రముఖులు పాత్రలు పోషించిన శ్రీవాస్తవకు మాత్రం విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్‌లోని వివిధ సినిమాల్లో నటించి.. ఆయన కామెడితో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఆయన ప్రకటనల్లో కూడా పనిచేశారు.
సినిమా ఇండస్ట్రీలో శ్రీ వాస్తవ జీవితం మొదట కష్టాలతోనే మొదలైంది.. ఆ తర్వాత ఆయన ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు గుర్తింపుని ఇచ్చారు. అయితే శ్రీనివాసవ తన తండ్రి నుంచి వచ్చిన కళను ఆధారంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చాడని సమాచారం. ఆయన తండ్రి రమేష్ చంద్ర శ్రీ వాస్తవ మంచి రచయిత, అంతేకాకుండా మిమిక్రీ కూడా చేసేవారు. దీంతో శ్రీ వాస్తవ కూడా మొదట మిమిక్రీ తో జీవితాన్ని ప్రారంభించారు. హాస్యనటుడు కావాలని కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన వివిధ చిత్రాల్లో నటించారు.
శ్రీ వాస్తవం మరణ వార్తను విని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ మరణం పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఆయన మరణించడం బాలీవుడ్కు తీరనిలోటని యూపీ సీఎం అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok