విడుదలైన రాజుగారి కోడిపులావ్ సినిమా.. పులావ్ రుచి ఎలా ఉందంటే.. ??

శివకోన హీరోగా, నిర్మాతగా మరియు డైరెక్టర్ గా తెరకెక్కించిన సినిమా రాజుగారి కోడి పులావ్.. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నటించారు. ఆగస్టు 4న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే.. ??

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2023, 01:03 PM IST
విడుదలైన రాజుగారి కోడిపులావ్ సినిమా.. పులావ్ రుచి ఎలా ఉందంటే.. ??

చిత్రం: రాజుగారి కోడిపులావ్ 
నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు
బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
డైరెక్టర్ : శివ కోన
సంగీతం : ప్రవీణ్ మని
సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు
ఎడిటర్ : బసవా - శివ కోన

అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై నిర్మించిన సినిమా రాజుగారి కోడిపులావ్.  ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదలైంది. సినిమా ట్రైలర్, టీజర్ లు అంచనాలని పెంచాయి. 

కథ: 
రాజుగారు (ప్రభాకర్) ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు. తన హోటల్ లో అమ్మే 'కోడి పులావ్' తో చుట్టూ పక్కల ఫేమస్ అవుతాడు. ఆ పులావ్ కు రాజు గారి కోడి పులావ్ అని పేరు పెట్టి పాపులారిటీ సంపాదిస్తాడు. కానీ భార్య తన మాట వినటం లేదని మరియు తనకి కొడుకు పుట్టలేదన్న కారణంతో అసంతృప్తిగా ఉంటాడు. ఇలా ఉండగా ఒక ప్రమాదంలో రెండు కాళ్లను పోగొట్టుకుంటాడు. 
ఇదిలా ఉండగా.. చాలా రోజుల తరువాత కలిసిన ఆరుగురు స్నేహితులు రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ఫారుఖ్ (అభిలాష్ బండారి) ఈషా (రమ్య దినేష్) భార్యభర్తలు.. ఆకాంక్ష (నేహా దేష్ పాండే) బద్రి ( కునాల్ కౌశిక్) భార్యభర్తలు.. డ్యాని (శివ కోన) క్యాండీ (ప్రాచి కెథర్) ఒక జంట.. అనుకున్న ప్లాన్ ప్రకారం.. రోడ్ ట్రిప్ లో వారు చేరుకోవాల్సిన గమ్యం రాకముందే కారు చెడిపోవటంతో నడుచుకుంటూ వారి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అడవిలో కాలినడకన ప్రయాణం కొససాగిస్తున్న సమయంలో క్యాండీ మరణిస్తుంది. క్యాండీ మరణానికి కారణం తెలియదు..మిగతా ఐదుగురు తప్పిపోవటం కారణంగా అడవిలోనే తిరుగుతూ ఉంటారు. అలా కాలి నడకన ప్రయాణిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఈషా కూడా కనిపించకుండా పోతుంది. అలా అడవిలోనే తిరుగుతూ చివరగా ఒక ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుండే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. క్యాండికి ఎలా చనిపోయింది.. ? ఈషాకి ఏం జరిగింది..?  ఫారుఖ్- ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది..? అలసు రాజుగారికి ఈ ముగ్గురు జంటలకు సంబంధం ఏంటి.. ? అనేదే సినిమా కథ. 

Also Read: Telangana Assembly Live: తెలంగాణలో కులగజ్జి.. మత పిచ్చి లేదు: మంత్రి కేటీఆర్

ఎవరెలా చేశారంటే.. ?
సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే.. శివకోన గురించే చెప్పాలి. చివరి వరకు వన్ మ్యాన్ షోగా నడిపించారు. నిర్మాతగా, డైరెక్టర్ గా మరియు సినిమాలో హీరో అన్ని భాద్యతలు పైన వేసుకొని చాలా కూల్ గా తన పాత్రకు న్యాయం చేశారు. అంతేకాకుండా డ్యాని క్యారెక్టర్లో ఉన్న షేడ్స్ తో పాటు.. కూల్ గా కనిపిస్తూనే తనదైన స్టైల్లో కామెడీ పండించారు. తరువాత ప్రాచీ థాకర్ విషయానైకి వస్తే.. మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కాకుండా, యాక్టింగ్ స్కిల్స్ తో తనదైన ముద్ర వేసింది. ఇక అభిలాష్ బండారి పాత్ర విషయానికి వస్తే.. ఫారూఖ్ పాత్రలో చాలా హ్యండ్ సమ్ గా కనిపించారు. తన పాత్రలో కూడా డీసెంట్ గా నటించి మెప్పించాడు. ఇక నేహా దేష్ పాండే రోల్ కి న్యాయం చేసింది. తనకు ఇచ్చిన ఆకాంక్ష పాత్రకు న్యాయం చేకూర్చింది. యాక్టింగ్ స్కోప్ ఉన్న రెండు కోణాలు ఉన్న ఆకాంక్ష పాత్రలో నేహా దేష్ పాండే జీవించేసింది. కన్నింగ్ ఉన్న పాత్రలో కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. చాలా సజహంగా నటించాడు. రెండు మూడు వేరియేషన్లు ఉన్న బద్రి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. తన ఫ్రెష్టన్ తో నవ్వు తెప్పిస్తుంది. ఇక ఫైనల్ గా ఈటీవి ప్రభాకర్ కనిపించిన కాసేపయిన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 

సంకేతిక అంశాలు: 
ముందే చెప్పినట్టు డైరెక్టర్ శివ కోన వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. తనకు మొదటి సినిమానే అయినా ఎక్కడా కూడా కొత్త దర్శకుడు అన్న ఫీలింగ్ రాదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా అద్భుతంగా తన పనితనాన్ని చూపించారు. ఫన్, థ్రిల్లింగ్ అంశాలను మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. ఇక సినిమాకు ముఖ్యమైనది సంగీతం. దీన్ని అందించిన ప్రవీన్ మణీ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఉత్కంఠబరితమైన సన్నివేశాల్లో తన చక్కని ప్రతిభను కనబరిచారు. అలాగే సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఇక యాక్టర్లు కొత్తవాళ్లైన చాలా అది తెలియకుండా అందంగా చూపించారు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకాస్త షార్ప్ కట్ చేసింటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే నిర్మాణ విలువల విషయాని వస్తే చాలా వరకు నేచురల్ గా చిత్రీకరించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏం కావాలో వాటిని చక్కగా తెర మీదు అవిష్కరించారు. మొత్తంగా సినిమా ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పిరియన్స్ అని చెప్పవచ్చు. 

Also Read: Reliance Jio Plan: జియోలో ఆ పోస్ట్ పెయిడ్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్

ప్లస్ పాయింట్స్: 
సినిమా కథ
కథనం
కొత్తగా ఉన్న ఫ్లాష్ బ్యాక్ 
హీరో బ్యాక్ స్టోరీ 
శివ కోన యాక్టింగ్ 
ట్విస్ట్స్ 

రేటింగ్: 2.7

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News