Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే మ్యాటర్..

Ram Charan: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన గ్లోబల్ స్టార్  తన కెరీర్ లోనే మరో రేర్ ఫీట్ అందుకోబోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 16, 2024, 10:38 AM IST
Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే మ్యాటర్..

Ram Charan:రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే తన సినిమాలతో  యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక 2022లో రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. అంతేకాదు గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెతున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రకు మంచి పేరు వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలోని డాన్సులతో , ఫైట్స్ తో ప్రేక్షకులను అలరించాడు.   ఇక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు మన దేశానికి తొలి ఆస్కార్ రావడంలో రామ్ చరణ్ పాత్ర మరవలేనిది. తాజాగా రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతుంది.

రామ్ చరణ్ పాపులారిటీని చూసిన మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు ఆయన మైనపు విగ్రహాన్ని లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన రామ్ చరణ్.. అక్కడ తన శరీరానికి సంబంధించిన కొలతలను ఇచ్చినట్టు  సమాచారం.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

మన దేశం నుంచి ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను ఈ మ్యూజియంలో కొలువు తీరాయి.  కానీ మన దక్షిణ భారత దేశం నుంచి మొదటగా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ లో కొలువైంది. ఆ తర్వాత మహేష్ బాబు, రీసెంట్ గా అల్లు అర్జున్ ల మైనపు విగ్రహాలను ఈ మ్యూజియంలో పెట్టారు. తాజాగా ఇపుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరబోతుంది.  సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి అది కూడా తెలుగు హీరోల్లో నాల్గవ వ్యక్తిగా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ కానున్నాడు.

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News