RRR Tickets Booking: అభిమానులకు శుభవార్త.. మొదలైన 'ఆర్​ఆర్​ఆర్' ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్!!

RRR Movie Premier Advance Bookings open in USA. మార్చి 25న భారత్‌లో ఆర్​ఆర్​ఆర్ విడుదల కానుండగా.. ఒకరోజు ముందే అమెరికాలో రిలీజ్ కానుంది. ఇందుకు సంబందించిన అడ్వాన్స్ బుకింగ్ అక్కడ ఓపెన్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 11:30 AM IST
  • మార్చి 25న ప్రేక్షకుల ముందుకు
  • 'ఆర్​ఆర్​ఆర్' ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్
  • అభిమానులకు శుభవార్త
RRR Tickets Booking: అభిమానులకు శుభవార్త.. మొదలైన 'ఆర్​ఆర్​ఆర్' ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్!!

RRR Movie Premier Advance Bookings open in USA: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ల కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్​ సినిమా 'ఆర్​ఆర్​ఆర్'​. అత్యంత భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా.. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా నిరంతరంగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది విడుదల అవ్వాల్సిన ఆర్​ఆర్​ఆర్ చిత్రం.. చివరికి 2022 మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఆర్​ఆర్​ఆర్ విడుదల తేది దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్​ను భారీగానే ప్లాన్​ చేశారు. గతంలో మాదిరిగానే ఎన్టీఆర్, రామ్​ చరణ్​, రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇక అభిమానులకు ఓ శుభవార్త అందింది. మార్చి 25న భారత్‌లో ఆర్​ఆర్​ఆర్ విడుదల కానుండగా.. ఒకరోజు ముందే అమెరికాలో రిలీజ్ కానుంది. ఇందుకు సంబందించిన అడ్వాన్స్ బుకింగ్ అక్కడ ఓపెన్ అయింది. టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. 

అమెరికాలో ప్రీమియర్ బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి అని 'సరిగమ సినిమాస్' అనే ట్విట్టర్ ఖాతా పేర్కొంది. ఆర్​ఆర్​ఆర్ సినిమా యూఎస్ ప్రీమియర్ బుకింగ్‌లు సినిమార్క్ లో ఓపెన్ అయ్యాయి. సినిమార్క్ 17, సినిమార్క్ ఫెయిర్ మార్క్ కార్నర్, సినిమార్క్ వెస్ట్ ప్లానో, సినిమార్క్ లైన్ కాన్ థియేటర్లలో బుకింగ్ ఓపెన్ అయింది. టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని షోలకు బుకింగ్ పూర్తయిందని సమాచారం. 

ఆర్​ఆర్​ఆర్ సినిమా బ్రిటన్​లో సుమారు వెయ్యి థియేటర్లలో రిలీజ్​ కానుంది. లండన్​లోని ప్రతిష్టాత్మకమైన 'ఒడియన్​ బీఎఫ్​ఐ ఐమ్యాక్స్'​లోనూ విడుదల అవుతోంది. లండన్​లో ఇదే అతిపెద్ద ఐమ్యాక్స్​ థియేటర్​. లండన్​ వాటర్​లూలో ఈ ఐమ్యాక్స్​ను నిర్మించారు. దాంతో థియేటర్​ పరిసరాల్లో నివసించే ప్రజలు మాత్రమే ఈ థియేటర్​లో సినిమాను చూస్తారు. ఇప్పటివరకూ హాలీవుడ్​ చిత్రాలు 'బ్యాట్​ మ్యాన్'​, 'లార్డ్​ ఆఫ్​ ది రింగ్స్​' సినిమాలను ప్రదర్శించారు. ఇప్పుడు 'ఆర్​ఆర్​ఆర్​' విడుదల కావడంతో ఈ గౌరవం దక్కించున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. 

Also Read: Shane Warne Ball of the Century: షేన్‌ వార్న్‌ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'.. చూస్తే మతులు పోవాల్సిందే (వీడియో)!!

Also Read: MS Dhoni: బస్సు డ్రైవర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ దూసుకెళ్లాడు (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News