Game Changer first look : అదిరిపోయిన రామ్ చరణ్‌ లుక్.. ఇండియన్ సినిమాకు 'గేమ్ చేంజర్'?

Game Changer First Look Poster రామ్ చరణ్‌ శంకర్ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్‌ను పెట్టడంతో పాజటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. టైటిల్‌తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2023, 03:15 PM IST
  • రామ్ చరణ్‌ బర్త్ డే స్పెషల్
  • గేమ్ చేంజర్ టైటిల్‌పై పాజిటివ్ బజ్
  • అదిరిపోయిన రామ్ చరణ్‌ ఫస్ట్ లుక్
Game Changer first look : అదిరిపోయిన రామ్ చరణ్‌ లుక్.. ఇండియన్ సినిమాకు 'గేమ్ చేంజర్'?

Game Changer First Look Poster రామ్ చరణ్‌ శంకర్ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ను మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. RC 15 అంటూ ఇన్ని రోజులుగా పిలిచిన ఈ సినిమా గేమ్ చేంజర్ అనే టైటిల్‌తో రాబోతోన్నట్టుగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అసలే ఈ సినిమాకు సంబంధించి మూడు లుక్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ సినిమాలో వివిధ రూపాల్లో రామ్ చరణ్‌ కనిపించనున్న సంగతి తెలిసిందే.

 

 

ఇందులో రామ్ చరణ్‌ను చూస్తే మోస్ట్ స్టైలిష్ట్‌గా కనిపిస్తున్నాడు. ఆ హెయిర్ స్టైల్, చేతికి వాచ్, బైక్‌ను నడిపే విధానం చూస్తుంటే ఇది స్టూడెంట్‌గా ఉన్న సమయంలో కనిపించే లుక్ అనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్ ఎంతో సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఇదేదో యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా వచ్చే స్టిల్‌లా కనిపిస్తోంది. మొత్తానికి రామ్ చరణ్‌ మాత్రం ఇండియన్ సినిమాకు గేమ్ చేంజర్‌లానే కనిపిస్తున్నాడు.

ఇంత కంటే గొప్పగా బర్త్ డే గిఫ్ట్‌ను ఎవ్వరూ ఇవ్వలేరు.. ఇంత కంటే ఎక్కువగా నేనేమీ అడగలేను.. థాంక్యూ శంకర్ సర్ అంటూ రామ్ చరణ్‌ ఈ ఫస్ట్ లుక్ మీద స్పందించాడు. రామ్ చరణ్‌ మాత్రం ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను కుమ్మేసేలా కనిపిస్తున్నాడు. అసలే ది మోస్ట్ టాలెంటెడ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ కథను అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇది శంకర్ విజన్‌లో అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది.

రామ్ చరణ్‌ శంకర్ సినిమాకు దిల్ రాజు అన్ లిమిటెడ్ బడ్జెట్‌ను ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. పాటలకే పదుల కోట్ల ఖర్చు చేసినట్టుగా టాక్. రీసెంట్‌గానే ఈ సినిమాలోని ఓ పాటను శంషాబాద్‌ ఏరియాలో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద దాదాపు ఐదు వందల కోట్ల పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలు ఇప్పటి వరకు జరిగినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా బరిలోకి దిగబోతోందన్న సంగతి తెలిసిందే.

Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్

Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News