మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) నే కాదు..కుటుంబంలో అందరూ ప్రత్యేకమే. అందరిదీ సేవాగుణమే. అపోలో హాస్పిటల్స్ ( Apollo Hospitals ) కుటుంబసభ్యురాలిగా..రామ్ చరణ్ భార్యగా ఉపాసన ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడామె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగా ఇంటి కోడలిగా..రామ్ చరణ్ భార్య ( Ramcharan Wife Upasana ) గా ఉపాసన ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటి కోడలిగానే కాకుండా అపోలో బిజినెస్ వ్యవహారాల్లో ఆమె పాత్ర కీలకం. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు గానీ సమాజానికి పనికొచ్చే పోస్టులతో గానీ ఆమె అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మెగా ఇంటి కోడలిగానే కాకుండా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందీమెకు. వ్యక్తిగత జీవితంపై ఎన్ని కామెంట్లు వచ్చినా మౌనంగా భరించడమే ఆమె ప్రత్యేకత. రామ్ చరణ్ భార్యగా వచ్చినప్పటి నుంచి ఆమెపై చాలా విమర్శలే వచ్చాయి. అయినా సరే నవ్వుతూ స్వీకరించింది. తనకంటే భర్త అందంగా ఉన్నాడన్నప్పుడు హ్యాపీగానే ఫీలయింది. భర్త బాగున్నాడంటే ఆనందమే కదా..బాధ పడాల్సిందేమీ లేదని చెప్పుకొచ్చింది. ఇలా ఎన్ని విమర్శలు చేసినా..కూల్‌గా సమాధానం ఇస్తూ వచ్చింది.
మరీ ముఖ్యంగా జీవితంపై తనకున్న అవగాహనను అందరితో పంచుకుంటుంది. అనేక విషయాల్ని దాచుకోకుండా చెబుతుంటుంది. ఇప్పుడదే కోవలో బయటి ప్రపంచానికి తెలియని ఓ విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అవే వ్యాఖ్యలు ఆమెపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నాయి.
ఒక ట్రాన్స్‌జెండర్ ( Transgender ) తో తనకి మంచి స్నేహం ఉందని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సాధారణంగా ట్రాన్స్‌జెండర్ అంటే దూరం పెడుతుంటారు అంతా. ట్రాన్స్‌జెండర్లను కూడా కలుపుకుని పోవాలని ఎంతమంది హితవులు చెప్పినా అమల్లోకి వచ్చేటప్పటికీ దూరంగానే ఉంటారు. వాళ్లు కూడా మనుషులేనని.. వారిని మంచిగా ట్రీట్ చేయాలంటూ చెప్పుకొచ్చింది ఉపాసన. అందుకే ట్రాన్స్ జెండర్లతో తనకు స్నేహముందని చెప్పింది ఉపాసన.
కేవలం ట్రాన్స్ జెండర్ విషయంలో కాకుండా మహిళలపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఇప్పటికే ఫిదా అయ్యారు. మహిళల్ని గౌరవించాలని..మహిళని గౌరవించని ఇంట్లో దేవికి పూజలు కూడా చేయకూదని చెప్పింది ఉపాసన. అలాంటి ఇళ్లలో అమ్మవారి ఫోటోలు కూడా ఉండకూడదంది. ఈ వ్యాఖ్యలపై మరోసారి ట్రెండింగ్ లో నిలిచిన ఉపాసన ( Upasana ) పై ప్రశంసలు కురిసాయి. అందుకే ఉపాసనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Also read: Keerthy Suresh: కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రైలర్ విడుదల