Ram Gopal Varma : నాటు నాటుకు ఆస్కార్ వచ్చే రేంజ్ ఉందా?.. కీరవాణికి ఆర్జీవీ సూటి ప్రశ్న

Ram Gopal Varma About Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తే.. అసలు ఆ పాటకు ఆస్కార్ రావడం ఏంటి?.. అందులో ఏముంది? అని ఆరాలు తీసిన వారు కూడా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ ఎందుకు వచ్చింది? అని అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 09:02 PM IST
  • నెట్టింట్లో రామ్ గోపాల్ వర్మ రచ్చ
  • కీరవాణితో ఆర్జీవీ స్పెషల్ ఇంటర్వ్యూ
  • నాటు నాటుపై నాటు కామెంట్లు
Ram Gopal Varma : నాటు నాటుకు ఆస్కార్ వచ్చే రేంజ్ ఉందా?.. కీరవాణికి ఆర్జీవీ సూటి ప్రశ్న

Ram Gopal Varma About Naatu Naatu సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య నిజం అంటూ అందరినీ హడలెత్తిస్తున్నాడు. నిజం మాట్లాడతాను.. అబద్దం బట్టలూడదీస్తాను అంటూ ఇలా నానా హంగామా చేస్తున్నాడు. అయితే తాజాగా కీరవాణితో ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. మామూలుగా అయితే ఆర్జీవీ ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. కానీ ఆయన మొదటి సారిగా ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కీరవాణికి దిమ్మ తిరిగేలా ఆర్జీవీ ప్రశ్నలు సంధించాడు.

ఆస్కార్ వచ్చినందుకు మీకు కంగ్రాట్స్ చెప్పను అని ఆర్జీవీ అంటాడు. మీ నుంచి నేను కంగ్రాట్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయను అంటూ కీరవాణి కూడా కౌంటర్లు వేస్తాడు. ఒకవేళ మీరు కాకుండా.. నాటు నాటు పాటను వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా చేసి ఉంటే.. ఆస్కార్ గెలిస్తే.. అప్పుడు మీరేం అనుకుంటారు? నాటు నాటుకు ఆస్కార్ వచ్చే రేంజ్ ఉందని అనుకుంటారా? అని సూటిగా ప్రశ్నించాడు ఆర్జీవీ.

 

నాటు నాటు అనే పాట.. మీ టాప్ 100 లిస్ట్‌లో ఉంటుందని మీరు భావిస్తున్నారా? అని అడిగాడు ఆర్జీవీ. మీరు ఆర్టిస్ట్‌గా ఓ సినిమా తీస్తే.. అవతలి వాళ్లు ఏం చెబుతారన్న దాన్ని పరిగణలోకి తీసుకుంటారు గానీ.. మీరు ఏం అనుకుంటారనే దాని మీద ఉండదు అని వర్మ అంటాడు. మీ ఈ మాటలతో నేను ఏకిభవించను అని కీరవాణి అంటాడు.

Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌

ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్‌లో మీ సాంగ్ వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్.. మీ కెరీర్ మొత్తంలో సాంగ్స్ విషయంలో వచ్చిన ఫీలింగ్‌ ఎప్పుడైనా కలిగిందా? అని వర్మ అడిగాడు. వీటికి కీరవాణి ఎలా సమాధానం చెబుతాడో చూడాలి. అసలే కీరవాణి ట్యూన్, చంద్రబోస్ సాహిత్యం మీద చాలా రకాల విమర్శలున్నాయి. అసలు నాటు నాటు పాటకు ఆస్కార్ ఎలా వచ్చిందని చాలా మంది ఇప్పటికీ అనుకుంటారు. మొత్తానికి మన ఇండియన్ సాంగ్‌కు మొదటి సారిగా ఆస్కార్ అవార్డ్ రావడం మాత్రం ఓ హిస్టరీ అని చెప్పాలి.

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News