RGV: వర్మపై కేసు నమోదు

అమరావతి : రాంగోపాల్ వర్మకు కేసులు కొత్త కాదు.. వివాదాస్పద దర్శకుడిగా పేరున్న వర్మపై గతంలో అనేక సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా అదే కోవలో వర్మపై మరో కేసు నమోదైంది.

Last Updated : Jul 28, 2020, 11:25 PM IST
RGV: వర్మపై కేసు నమోదు

అమరావతి : రాంగోపాల్ వర్మకు కేసులు కొత్త కాదు.. వివాదాస్పద దర్శకుడిగా పేరున్న వర్మపై గతంలో అనేక సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా అదే కోవలో వర్మపై మరో కేసు నమోదైంది. వర్మపై నాయి బ్రహ్మణ సంఘం నాయకులు రాజోలు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ.. నాయి బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ నాయి బ్రహ్మణ సంఘం ప్రతినిధులు రాజోలులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయి బ్రాహ్మణ సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

వర్మ సినిమాల విషయానికొస్తే... ఆయన తెరకెక్కించిన పవర్ స్టార్ మూవీ ఇటీవలే ఆర్జీవీ థియేటర్ పోర్టల్ లో విడుదల కాగా.. తాజాగా మర్డర్ మూవీ ట్రైలర్ విడుదలైంది. మారుతి రావు, అమృత, ప్రణయ్‌ల రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై కూడా అమృత, ప్రణయ్ తండ్రివైపు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదేకాకుండా వర్మ ఫ్యాక్టరీలో ఇంకెన్నో ఇతర చిత్రాలు కూడా రూపొందుతున్నాయి.

Trending News