The Warriorr: ది వారియర్ కు వరుణ గండం.. హైద్రాబాద్లో మరీ దారుణంగా అమ్మకాలు.. ఇలా అయితే కష్టమే!

Rain Effect to The Warriorr Movie: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నైజాం ఏరియా మొత్తానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మొదటి రోజు కేవలం 18 నుంచి 20 షోలు మాత్రమే సినిమాకు దక్కాయని అంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 07:29 PM IST
  • రామ్ హీరోగా ది వారియర్
  • ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దం
  • వరుణ గండంతో టెన్షన్
The Warriorr: ది వారియర్ కు వరుణ గండం.. హైద్రాబాద్లో మరీ దారుణంగా అమ్మకాలు.. ఇలా అయితే కష్టమే!

Rain Effect to The Warriorr Movie: రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.  సాధారణంగా ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే అమెరికాలో ప్రీమియర్స్ గనుక పడకపోతే మొట్టమొదటి షో హైదరాబాదులోని ఐమాక్స్ థియేటర్ లో ఎనిమిది గంటల 45 నిమిషాలకు పడుతుంది. అయితే ఈసారి ఆ షో కూడా ఉండడం లేదని ప్రపంచవ్యాప్తంగా 9:30కి సినిమా విడుదల చేస్తున్నామని ప్రమోషన్స్ లో రామ్ ప్రకటించారు.

ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సినిమాకు ఎంతమంది థియేటర్ల వరకు వస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.  సాధారణంగా శుక్రవారం నాడు సినిమాలు విడుదల చేస్తారు. కానీ ఎందుకో ఈసారి ది వారియర్ మేకర్స్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి గురువారం నాడే సినిమా విడుదల చేస్తున్నారు. అయితే మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరీ ముఖ్యంగా సినీ పరిభాషలో వాడే నైజాం ఏరియా మొత్తానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మొదటి రోజు కేవలం 18 నుంచి 20 షోలు మాత్రమే సినిమాకు దక్కాయని అంటున్నారు. ఆ 18 నుంచి 20 షోలలో కూడా దాదాపు 5% మాత్రమే బుకింగ్స్ జరిగాయని భారీ వర్షాల నేపథ్యంలో ప్రేక్షకులు ఎంతవరకు బయటకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. గురువారం సెలవు రోజు కాదు,  ఆఫీసులకు రాలేని వారిని వర్క్ ఫ్రమ్ చేయమంటున్నాయి. దీంతో సినిమా కోసం రిస్కు చేసి వర్షంలో థియేటర్లకు వస్తారా రారా అనేది చూడాల్సి ఉంది.

అయితే సినిమా మీద మాత్రం రామ్ సహా దర్శకనిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రామ్ కెరీర్ లోనే మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దానికి తోడు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కృతి శెట్టి నటించడంతో ఆమె కూడా థియేటర్లకు జనాల్ని రప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి వరుణ గండం నుంచి తప్పించుకుని ఈ సినిమాకు ఏ మేరకు కలెక్షన్లు రాబట్టేలా చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వార్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏమిటి అనేది.
Also Read: Brahmastra: బ్రహ్మాస్త్ర కథ బయట పెట్టేసిన డైరెక్టర్.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి

Also Read: Koratala siva: ఆచార్య దెబ్బ.. కొరటాల ఆఫీస్ ముందు ఎగ్జిబిటర్ల భైఠాయింపు.. నెక్స్ట్ చిరునే అంటూ!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News