Anasuya Bharadwaj Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు దేవతలా మారిన అనసూయ "ఆంటీ’’

Anasuya Bharadwaj became godess to Liger and Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి, లైగర్ సినిమాకు అనసూయ భరద్వాజ్ దేవతలా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2022, 04:05 PM IST
Anasuya Bharadwaj Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు దేవతలా మారిన అనసూయ "ఆంటీ’’

Anasuya Bharadwaj became godess to Liger and Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ చిత్రం ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మొదటి ఆట నుంచి కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. మెజారిటీ ఈ సినిమా బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం సినిమా పర్వాలేదని అంత తీసేయదగ్గ సినిమా ఏమీ కాదని కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ లైగర్ సినిమా మీద డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ప్రమోషన్స్ సమయంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్లను, ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో చేసిన కొన్ని కామెంట్లను గుర్తు చేసుకుని మరీ చాలామంది విజయ్ దేవరకొండ మీద, లైగర్ సినిమా మీద ట్రోల్స్ చేశారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ ట్రోల్ చేసే వారందరినీ తనవైపు తిప్పుకుంది యాంకర్ అనసూయ భరద్వాజ్.

లైగర్ సినిమా మీద ఒక నెగిటివ్ కామెంట్ చేసిన అనసూయ ఒక్కసారిగా ట్రోలర్స్ అందరినీ తన వైపు తిప్పుకున్నట్లు అయింది. విజయ్ దేవరకొండను, లైగర్ సినిమాని ట్రోల్ చేయాలని అనుకున్న వారందరూ ఇప్పుడు అనసూయ మీద పడ్డారు. విజయ్ దేవరకొండను అనసూయ టార్గెట్ చేసినట్లే కనిపిస్తుంది కానీ అది మాత్రం విజయ్ దేవరకొండకి, లైగర్ టీంకి ప్లస్ అయినట్లే కనిపిస్తోంది. నెటిజెన్ల టార్గెట్ అంతా కూడా ఇప్పుడు అనసూయ కావడంతో ఆమెను ఎలా ట్రోల్ చేయాలా అనే విషయం మీద అందరూ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. నిజానికి ఈ విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ సమయంలో అభిమానులను చూసి ఆనందంలో నా అయ్య ఎవరో తెలియదు, తాత ఎవరో తెలియదు కానీ మీ అభిమానం చూస్తే ముచ్చటేస్తుంది అంటూ కామెంట్లు చేశారు.

అలాగే హిందీ బాయ్ కాట్ ట్రెండ్ విషయంలో కూడా అమీర్ ఖాన్ కు మద్దతు ఇస్తూ విజయ్ దేవరకొండ మాట్లాడటం కూడా ట్రోలర్లకు పెద్ద ఆయుధంలా దొరికింది. అంతేకాక బాయికాట్ చేస్తే మేమేం చేస్తాం సినిమా చూడాలనుకున్న వాళ్ళు ధియేటర్లకు వస్తారు లేదంటే ఓటీటీలో చూస్తారని అంటూ చేసిన కామెంట్లను కూడా తెరమీదకు తీసుకొచ్చి ట్రోల్ చేశారు. అయితే లైగర్ టీం సహా విజయ్ దేవరకొండకు అనసూయ ఒక దేవతలాగా వచ్చి ట్రోలర్లు దృష్టిని తనం అయిపోతుందని చెప్పక తప్పదు.
Also Read: Bandla Ganesh News Channel: న్యూస్ ఛానల్ పెట్టబోతున్న బండ్ల గణేష్?

Also Read: Jr NTR Movie in 9 Languages: ఎన్టీఆర్ సినిమా నెవర్ బిఫోర్ ఫీట్.. ఏకంగా తొమ్మిది బాషలలో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News