Alia Bhatt : అలియా భట్ బ్యూటీ సీక్రెట్ ఇదే.. తెలిస్తే తప్పకుండా ట్రై చేస్తారు..?

Alia Bhatt Beauty Tips:  అలియా భట్ కు బీట్రూట్ తో తయారు చేసిన హెల్తీ రెసిపీ అంటే చాలా ఇష్టమట.. ఇది వారంలో రెండు సార్లు అయినా తాను తింటానని చెప్పుకొచ్చింది. అందుకే తాను ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ రెసిపీ కూడా ఒక కారణమని స్పష్టం చేసింది ఈ న్యాచురల్ బ్యూటీ.

Written by - Vishnupriya | Last Updated : Jul 27, 2024, 07:53 PM IST
Alia Bhatt : అలియా భట్ బ్యూటీ సీక్రెట్ ఇదే.. తెలిస్తే తప్పకుండా ట్రై చేస్తారు..?

Alia Bhatt Beauty Secret:  బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  మోస్ట్ బ్యూటిఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న అలియాబట్ నాచురల్ బ్యూటీగా కూడా పేరు సొంతం చేసుకుంది..  మేకప్ లేకపోయినా సరే అంతే అందంగా  ఫిట్ గా , యంగ్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె .. తండ్రి పేరు ప్రఖ్యాతలు ఉపయోగించుకోకుండా సొంతంగా తన నటనతో పేరు దక్కించుకుంది. ఇక గత ఏడాది తాను ప్రేమించిన రణబీర్ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ.. ఇంకొకవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతోంది. 

Add Zee News as a Preferred Source

ఇకపోతే ఇన్ని పనులలో బిజీగా ఉండే అలియా భట్ తనకంటూ తన ఆరోగ్య విషయంపై ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.. మరి ఆలియా కూడా తన బ్యూటీని కాపాడుకుంటూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుందట. అందులో భాగంగానే తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ... అలాగే అందంగా కనిపించడం కోసం ఒక రెసిపీ తయారు చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది అలియా భట్ .. మరి అలియా భట్ బ్యూటీ సీక్రెట్ ఏంటి..?  ఆమె ఫేవరెట్ రెసిపీ  ఎలా తయారు చేసుకోవాలి?  అనే విషయాలు ఆమె మాటల్లోనే..

ముందుగా బీట్రూట్ ను బాగా ఉడికించాలి. పైన చెక్కు తీసి ఉడికిన బీట్రూట్ ను తురుముకోవాలి. అందులోకి ఒక కప్పు పెరుగు, చిటికెడు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర అన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మరొక బాణలి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిని స్టవ్ మీద పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ కొంచెం, కొన్ని కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమంలో కలిపేయాలి. అంతే అలియా భట్ ఫేవరెట్ బీట్రూట్ హెల్తీ రెసిపీ రెడీ.. ఇక దీనిని నేరుగా అయినా తినవచ్చు లేకపోతే చపాతి వంటి వాటిల్లోకి ట్రై చేయవచ్చు.

చూడడానికి చాలా సింపుల్ గా ఉండే ఈ రెసిపీ రుచికి అద్భుతంగా ఉంటుందని ఆమె తెలిపింది. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అలియా భట్ కి ఇష్టమైన ఈ ఫేవరెట్ రెసిపీ ని ఒకసారి ట్రై చేయండి.

Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News