Rakhi Sawant Husband: రాఖీ సావంత్ భర్తపై రేప్ కేసు.. ఆ సమయంలో ట్రాప్ చేసి మరీ!

Rape Case on Adil Durrani : రాఖీ సావంత్ భర్త అనిల్ దుర్రానీ కష్టాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి, తాజాగా ఆయన మీద ఒక రేప్ కేసు నమోదయింది, ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 12, 2023, 06:14 PM IST
Rakhi Sawant Husband: రాఖీ సావంత్ భర్తపై రేప్ కేసు.. ఆ సమయంలో ట్రాప్ చేసి మరీ!

Rape Case on Rakhi Sawant Husband: రాఖీ సావంత్ సహా ఆమె భర్త ఆదిల్ ఖాన్ దుర్రానీ గత కొద్ది రోజుల్లో వారి వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన విభేదాల వలన పదేపదే వార్తల్లోకి ఎక్కుతున్నారు. పెళ్లయినప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉదనగా ఈ మధ్య రాఖీ ఆదిల్‌ తనను మోసం చేశాడని, గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపించింది,  ఈ క్రమంలో అతనిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత ఆదిల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.  

ఇక ఇప్పుడు తాజాగా మైసూర్‌లో ఆదిల్ ఖాన్ దురానీపై కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదైంది.  ఆదిల్‌ తనపై అత్యాచారం చేశాడని ఒక ఇరానీ మహిళ ఆరోపించింది. మైసూర్‌లోని వివి పురం పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 376 కింద ఆదిల్ దురానీపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆదిల్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇరాన్‌ విద్యార్థిని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మైసూర్‌లో సహజీవనం చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుంటాననే సాకుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని సదరు ఇరానీ మహిళ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది.

ఐదు నెలల క్రితం తనను అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరగా.. తనకు చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధం ఉందని చెప్పి ఇదంతా చాలా కామన్ అని అంటూ నిరాకరించాడని సదరు యువతి తెలిపింది. ఇక ఆమె పెళ్లి చేసుకోవాలని కోరినప్పటి నుంచి ఆ మహిళకు అసభ్యకరమైన ఫొటోలు పంపి బెదిరించి బ్లాక్‌మెయిల్ చేశాడని పేర్కొనడంతో అతని మీద IPC సెక్షన్లు 376, 417,420, 504 మరియు 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నిజానికి  రాఖీ సావంత్‌ గత ఏడాది ఆదిల్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే ఇద్దరూ తమ వివాహాన్ని ఎందుకో కానీ కొన్నాళ్ళు రహస్యంగా ఉంచారు. రాఖీ గత నెలలో తన పెళ్లిని అధికారికంగా ప్రకటించి, అదే సమయంలో ఆదిల్ వివాహేతర సంబంధం గురించి కుల ఓపెన్ అయింది. ఇక ఆ సమయంలోనే రాఖీ ఆదిల్‌ తనపై దాడి చేసి తాను మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు, ఆమె ఇంటికి రాఖీని సందర్శించిన ఆదిల్‌ను ఓషివారా పోలీసులు అరెస్టు చేయగా అతను ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న ఆదిల్ కు ఇప్పుడు రేప్ కేసుతో కష్టాలు మరింత పెరిగాయి. 
Also Read: Ananya Nagalla Bold: అనన్య నాగళ్లను ఇంత బోల్డ్ గా ఎప్పుడూ చూసి ఉండరు.. పైన ఏమీ లేకుండానే!

Also Read: RK Roja on Nagababu: గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన.. నాగబాబుకు ఆర్కే రోజా ఘాటు కౌంటర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News