Rashmika Mandanna: బాలీవుడ్‌కి రష్మిక మందన

Rashmika Mandanna’s Bollywood debut with Mission Majnu movie: రష్మిక మందన .. అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్‌ 'మిషన్ మజ్ను' సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Last Updated : Dec 23, 2020, 11:29 PM IST
Rashmika Mandanna: బాలీవుడ్‌కి రష్మిక మందన

Rashmika Mandanna’s Bollywood debut with Mission Majnu movie: రష్మిక మందన .. అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్‌ 'మిషన్ మజ్ను' సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. పాకిస్తాన్‌లో భారతదేశానికి చెందిన రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ ఏజెన్సీ రా (RAW) జరిపిన అతిపెద్ద రహస్య ఆపరేషన్ గురించి ఉండబోతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలతో పాటు అమర్ బుటల, గరిమ మెహతా నిర్మిస్తున్నారు. శాంతను బాగ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రష్మిక తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఈ సినిమాతో తాను బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నానని రష్మిక మందన్న ( Rashmika Mandanna ) తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప, ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో కార్తీ సరసన సుల్తాన్ చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి ఇటీవలే సుల్తాన్ చిత్రంతో ( Sultan movie ) తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తాజాగా హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన కెరీర్‌ని మరింత పదిలం చేసుకుంటోంది.

Also read : Rashmika Mandanna: రష్మిక మందన్న పారితోషికం ఎంతో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News