Tiger Nageshwararao: రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' టీజర్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Tiger Nageshwararao Movie: టైగర్ నాగేశ్వర రావు’ సినిమా అప్‍డేట్‍ వచ్చేసింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2023, 05:17 PM IST
Tiger Nageshwararao: రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' టీజర్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Tiger Nageshwararao Movie Teaser Update: మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageshwararao). 70,80 ద‌శ‌కాల్లో స్టువర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో టైగర్‌ నాగేశ్వరరావు తెరకెక్కుతుంది. అలాంటి గజదొంగ కథ బ‌యోపిక్‌గా తెర‌కెక్కుతుండటంతో ఆడియెన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.  ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 17న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. యాక్షన్ యాంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కృతిసనన్‌ సోదరి నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా రేణుదేశాయ్ ఈ మూవీ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!

మరోవైపు రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం ఈగల్(Eagle) అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోండగా.. నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు టాక్ వినిపిస్తోంది.

Also read: Actor Sathyaraj: కట్టప్ప ఇంట విషాదం.. సత్యరాజ్ తల్లి కన్నుమూత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News