Kantara OTT Release Date : ఓటీటీలోకి కాంతారా.. ఎప్పుడు ఎక్కడంటే?

Kantara OTT Release Date రిషభ్ శెట్టి నటించిన కాంతారా సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి యాభై రోజులైంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వార్త వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 06:42 AM IST
  • కాంతారాకు యాభై రోజులు
  • అమెజాన్ ప్రైమ్‌లో కాంతారా
  • వచ్చే వారం నుంచే స్ట్రీమింగ్‌?
Kantara OTT Release Date : ఓటీటీలోకి కాంతారా.. ఎప్పుడు ఎక్కడంటే?

Kantara OTT Release Date : కాంతారా సినిమాను త్వరలోనే ఓటీటీలోకి తీసుకురాబోతోన్నారు. అమెజాన్ సంస్థ కాంతారా సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తుంది. నవంబర్ 24 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తోందంటూ సమాచారం అందుతోంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సింది. నిర్మాతలు గానీ, అమెజాన్ గానీ ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే చేయలేదు. మొత్తానికి కాంతారా కన్నడలో రిలీజై యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా కన్నడలో ఈ చిత్రం వసూళ్లను రాబడుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కన్నడ కాంతారా జెండా రెపరెపలాడుతూనే ఉంది.

రిషభ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం భూతకోళం, ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబేలా చేసింది. కాంతారా సినిమాను చూసి కన్నడ ప్రభుత్వం కూడా ఆ తెగను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ తెగకు సంబంధించిన వాళ్లకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. కేజీయఫ్, చార్లీ వంటి సినిమాల తరువాత కాంతారా సినిమాను కన్నడను మరో స్థాయికి తీసుకెళ్లింది.

వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే కాంతారా చిత్రం నాలుగు వందల కోట్లను కొల్లగొట్టేసింది. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కాంతారా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దుమ్ములేపేసింది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం ఓవర్సీస్‌లో అద్బుతమైన కలెక్షన్లను రాబట్టింది.

కన్నడలో ఇలా ఈ మధ్య కాలంలో యాభై రోజులు ఇలా విజయవంతంగా ఆడుతున్న మరో చిత్రం లేదు. పైగా ఓవర్సీస్‌లోనూ యాభై రోజులు పూర్తి చేసుకుని ఇంకా కలెక్షన్లను రాబడుతున్న చిత్రంగా కాంతారా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీలో కాస్త ఆలస్యంగా ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయితే.. అక్టోబర్ 15న మిగతా అన్ని భాషల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : Krishna Bronze Statue: తండ్రి కోసం 30 అడుగుల కాంస్య విగ్రహం, మ్యూజియం ఏర్పాటుకు మహేశ్ నిర్ణయం

Also Read : Liger Movie: పూరీ, ఛార్మీలకు లైగర్ కొత్త కష్టాలు, ఈడీ విచారణకు హాజరైన ఇద్దరు నిర్మాతలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News