Sai Dharam Tej about his Bike Accident: సాయి ధరమ్ తేజ్‌కు ఇది పునర్జన్మ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చావు అంచుల వరకు వెళ్లి, మృత్యువుని జయించి వచ్చాడు. దొరికిన ఈ సెకండ్ చాన్స్ మీద సాయి ధరమ్ తేజ్ గొప్పగా స్పందించాడు. తనకు జరిగిన బైక్ ప్రమాదం గురించి స్పందించాడు. తాను ఆ ప్రమాదాన్ని ఓ పీడకలగా భావించడం లేదని అన్నాడు. అదొక గుణపాఠం అని, ఓ స్వీట్ మెమరీ అని చెప్పుకొచ్చాడు.
బైక్ యాక్సిడెంట్ తరువాత చాలా నేర్చుకున్నా అని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మాట విలువ తెలిసిందని అన్నాడు. అంతకు ముందు తాను ఎక్కువగా వాగుతూ ఉండే వాడినని, కానీ హాస్పిటల్ బెడ్డు మీద మాటలు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు వాటి విలువ తెలిసిందని అన్నాడు. అయితే ఇంట్లో వాళ్లు, తొటి నటులు, మామయ్య పవన్ కళ్యాణ్ ఇలా అంతా కలిసి ధైర్యం చెప్పారని అన్నాడు. తన మాట అర్థం కాకపోయినా, ఏదీ మళ్లీ చెప్పు..నెమ్మదిగా చెప్పు అని అడిగి మరీ అర్థం చేసుకునేవారని నాటి తన పరిస్థితి గురించి వివరించి చెప్పాడు.
మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరమని తన తల్లి చెప్పి, బైక్ ఎక్కించిందని చెప్పుకొచ్చాడు. తనకు ఎంత మంది ఆప్తులు వున్నారో, తన కోసం ఎంత మంది ప్రార్థించారో తెలిసిన తరువాత ఇది కదా తాను సంపాదించిన ఆస్తి అని అర్థం అయిందని ఎమోషనల్ అయ్యాడు.
ఈ క్షణం బతకాలి.. వర్తమానంలో బతకాలి అనే విషయాన్ని తెలుసుకున్నానని అన్నాడు. అందుకే నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, అందరితో కలిసి మెలిసి వుంటూ, జీవితాన్ని ఆస్వాదించాలని ఫిక్స్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. ప్రమాదం తరువాత కోలుకుని సెట్‌కు వస్తే, ఏదో తొలిసారి కెమేరా ముందు నిల్చున్న ఫీల్ వచ్చిందని అన్నాడు. అన్నీ సెట్ కావడానికి రెండు రోజులు పట్టిందని గుర్తు చేసుకున్నాడు. తాను నటించిన విరూపాక్ష చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది.
Also Read: Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే
Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook