Sai Dharam Tej: నా భార్యగా వచ్చే అమ్మాయి ఈ షరతులు పాటించాల్సిందే..?

Sai Dharam Tej Upcoming Movies: మెగా హీరో సాయి ధరంతేజ్ తనకు కాబోయే భార్య సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, అలాగే తాను తన అమ్మకు నచ్చి ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఈ లక్షణాలు ఓకే అయితే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ప్రస్తుతం ఈ హీరో తన పెళ్లి గురించి చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 29, 2024, 10:19 PM IST
Sai Dharam Tej: నా భార్యగా వచ్చే అమ్మాయి ఈ షరతులు పాటించాల్సిందే..?

Sai Dharam Tej Wedding: మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటనతో,  డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మంచి కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను ఎప్పుడు కూడా అలరిస్తూనే ఉంటాడు. అందుకే సాయి ధరంతేజ్ అంటే ఒక మెగా అభిమానులకే కాదు ప్రజలకి కూడా ఒకింత నమ్మకం ఉందని చెప్పాలి. అంతేకాదు సమాజంలో జరిగే అనుచిత అసభ్యకర సన్నివేశాలపై స్పందిస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు.

ఈ మధ్యకాలంలో ఒక తండ్రి,  కూతుర్ల విషయంపై ఒక యూట్యూబర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు ఏకంగా అతడిని జైల్లో పెట్టించిన ఘనత సాయి ధరంతేజ్  సొంతం అనే చెప్పాలి. ఏకంగా ఈయన చేసిన పనికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగివచ్చారు. తనకున్న సెలబ్రిటీ హోదాను ఆయన ఉపయోగించుకుని ప్రజలకు మంచి చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.  ఇప్పుడు తన మేనమామ  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాటలోనే సాయి ధరంతేజ్ నడుస్తూ సమాజానికి మేలు చేయాలని పూనుకున్నారు. 

ఇకపోతే యాక్సిడెంట్ తర్వాత నటనపై మళ్లీ ఆసక్తి పెంచుకున్న ఈయన విరూపాక్ష చిత్రం తో  భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విరూపాక్ష -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసింది. ఈయన ప్రొఫెషనల్ విషయాలు అందరికీ తెలుసు కానీ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి పైగా ఈయన వయసు వారందరూ పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటూ ఉంటే,  ఇంకా ఈయన వివాహానికి దూరంగానే ఉన్నారు. అందుకే చాలామంది అమ్మాయిలతో ఈయనకు ఎఫైర్ రూమర్స్ అంటగడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరం తేజ  తనకప్పుడే ఎఫైర్ రూమర్స్ అంటగట్టకండి అంటూ సరదాగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. 

అయితే అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి భార్య కావాలి..? మీకు  కాబోయే భార్యకు మీరు పెట్టే కండీషన్ ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. నాకు కాబోయే భార్యకు సోషల్ మీడియా అలవాటు ఉండకూడదు.. ఒకవేళ అలవాటున్నా ఆమె దూరంగా ఉండాలి. పైగా మా అమ్మకు ఆమె లక్షణాలు నచ్చి ఉండాలి.ఈ రెండు షరతులకు ఒప్పుకుంటే కచ్చితంగా అమ్మాయి నాకు భార్య అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు సాయిధరమ్ తేజ. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఈయనను ప్రశంసిస్తున్నారు.

Read more: Shravana mass 2024: ఆగస్టు నెలలో శ్రావణంతో సహా రాఖీ, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి పండుగల తేదీలివే..

Read more: Tirumala: తిరుమలలో శ్రావణ మాస ఉత్సవాలు.. ఆగస్టు నెలలో జరిగి విశేష వేడుకల డిటెయిల్స్ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x