OG: పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అని తెలియదు…సలార్ నటి షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని హీరో కన్నా కూడా అతని అభిమానులు దైవంగా కొలుస్తూ ఉంటారు. అంతటి అభిమానం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉంటారు అంటే మీరు నమ్ముతారా?.. అయితే ఇప్పుడు ఒక ఫేమస్ నటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2023, 06:40 PM IST
OG: పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అని తెలియదు…సలార్ నటి షాకింగ్ కామెంట్స్

Sriya Reddy: పవన్ కళ్యాణ్ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే అందులో బ్రో సినిమా మినహా అన్ని పెండింగ్ పడుతూనే వస్తున్నాయి. బ్రో సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకోగా.. ఆయన క్రిష్ తో ఒప్పుకున్న హరిహర వీరమల్లు.. హరీష్ శంకర్ తో ఒప్పుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏమిటో ఎవరికి తెలియదు. కాగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న చిత్రాలలో ప్రస్తుతం ఆయన అభిమానులకు ఎక్కువ అంచనాలు ఉందే చిత్రం మాత్రం సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి.

ఈ చిత్రం చిన్న టీజర్ కూడా ఈ మధ్య విడుదలై అందరినీ అలరించింది. కాగా ఈ చిత్రం షూటింగ్ సేరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలవుతుందని అభిమానులు ఆశగా ఉన్నారు. ఈ చిత్రం నిర్మాత  దానయ్య ఇప్పుడల్లా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాదు అని చెప్పినా.. పవన్ అభిమానులు మాత్రం కళ్ళు కాయలు కాసేలా ఈ చిత్రం అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో సలార్ లో మనకు కనిపించి మెప్పించిన శ్రియ రెడ్డి కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. తెలుగు ప్రేక్షకులకు అప్పుడప్పుడు‌... అమ్మ చెప్పింది లాంటి సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన శ్రియ రెడ్డి.. విశాల్ తో చేసిన పొగరు సినిమాతో తన నెగిటివ్ క్యారెక్టర్ కి మంచి పేరు తెచ్చుకుంది. కాగా ఆ తర్వాత సినిమాలకు దూరమైన ఈమె ఈ మధ్య విడుదలైన సలార్ చిత్రంలో మరోసారి నెగిటివ్ క్యారెక్టర్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది.

ఈ నేపథ్యంలో శ్రియ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను కలిసేంతవరకు ఆయన అంత పెద్ద స్టార్ అని తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రియారెడ్డి. ఓజి సినిమాలో తను నటిస్తున్నానని తెలిసాక ఎక్కడికి వెళ్లినా ‘మీరు దేవుడితో వర్క్ చేస్తున్నారు కదా’ అంటుంటే ఆయనకు ప్రేక్షకులలో ఎంత ఆదరణ ఉందో తెలిసింది అని చెప్పుకొచ్చింది ఈ నటి. ఇక ఓజీలో తాను భాగమైనందుకు, పవన్‌తో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలానే ఓజీ లో తన పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయని.. ఓజీ కోసం సుజిత్ అద్భుతమైన కథ రాసారని చెప్పి పవన్ అభిమానులను ఖుషీ  చేసింది శ్రియ.

Also Read: Hardik Pandya: ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం, తిరిగి కెప్టెన్సీ రోహిత్‌కేనా

Also Read: Ind vs SA Test Series: సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్, ఇద్దరు మినహా సీనియర్ల టీమ్ రెడీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News