Tiger 3 Trailer: యాక్ష‌న్ మోడ్‌లో సల్మాన్.. ఇంట్రెస్టింగ్ గా 'టైగర్ 3' ట్రైలర్

Tiger 3 Trailer: సల్లూభాయ్ నయా మూవీ టైగర్ 3. ఇందులో సల్మాన్ జోడిగా కత్రినా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 03:52 PM IST
Tiger 3 Trailer: యాక్ష‌న్ మోడ్‌లో సల్మాన్.. ఇంట్రెస్టింగ్ గా 'టైగర్ 3' ట్రైలర్

Tiger 3 Trailer: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి జంటగా నటించిన మూవీ 'టైగర్ 3'(Tiger 3 Movie). మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న‌ విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 2017లో వచ్చిన టైగర్ జిందా హై, వార్ (2019), పఠాన్ (2023) తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. 

''దేశంలోని శాంతికి, దేశంలోని శ‌త్రువుల‌కి మధ్య ఎంత దూరం ఉంటుంది. కేవ‌లం ఒక మ‌నిషంత'' అన్న డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. ‘'టపాసులు కాల్చడం నువ్వు మొదలు పెట్టావ్ నేను ముగిస్తా'’అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మెుత్తం పుల్ యాక్షన్ తో నిండిపోయింది. టైగ‌ర్ వ‌ల్ల త‌న ఫ్యామిలీని కోల్పోయిన ఇమ్రాన్ హష్మీ... అతడిపై ఎలా పగతీర్చుకున్నాడనేది మూవీ స్టోరీ. దేశాన్ని, తన కుటుంబాన్ని కాపాడుకునే పాత్రలో సల్మాన్ నటించాడు. 

ట్రైలర్ మెుత్తం యాక్షన్ సీన్స్ తో నిండిపోయాయి. ముఖ్యంగా సల్మాన్, కత్రినా చేసిన స్టంట్స్ గుస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ఇక విలన్ గా బాలీవుడ్ ప్రముఖ హీరో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News