Samantha Shakuntalam Dubbbing : సమంత కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. బెడ్డు మీద నుంచే డబ్బింగ్

Samantha Shakuntalam Dubbbing సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే బెడ్డు మీదున్నా కూడా సమంత మాత్రం డ్యూటీని వదలడం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 04:53 PM IST
  • ఫిబ్రవరి 17న సమంత శాకుంతలం
  • డబ్బింగ్ మొదలుపెట్టిన సమంత
  • బెడ్డు మీద నుంచే సమంత డబ్బింగ్
Samantha Shakuntalam Dubbbing : సమంత కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. బెడ్డు మీద నుంచే డబ్బింగ్

Samantha Shakuntalam Release Date సమంత ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. అయినా కూడా తన బాధ్యతను మరవడం లేదు. కర్తవ్యాన్ని వీడటం లేదు. తాను ఇచ్చిన మాటకు, పూర్తి చేయాల్సిన సినిమాల పనులను ఎంతో కష్టపడి పూర్తి చేసేస్తోంది. మయోసైటిస్‌తో సమంత బాధపడుతున్నా కూడా యశోద సినిమా కోసం బెడ్డు మీద నుంచే డబ్బింగ్ చెప్పింది సమంత.

ఇప్పుడు శాకుంతలం సినిమా కోసం సైతం సమంత డబ్బింగ్ చెప్పేస్తోంది. అది కూడా బెడ్డు మీద పడుకునే సమంత డబ్బింగ్ చెప్పేస్తోంది. అసలు సమంత తన మొహాన్ని మాత్రం చూపించడం లేదు. మొహం మీదైనా ఏమైనా మార్పులు వచ్చాయా? లేదా? అన్నది తెలియడం లేదు. కానీ సమంత ఇప్పుడు శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులతో బిజీగా ఉంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఈ మేరకు సమంత షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో సమంత తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. బెడ్డు మీద లేవలేని స్థితిలోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. సమంత ఇక పాత్రకు డబ్బింగ్ చెబుతూ మధ్యలో ఇలా పోస్ట్ చేసినట్టుగా ఉంది.

తాజాగా శాకుంతలం సినిమా డేట్‌ను దిల్ రాజు లాక్‌ చేశాడు. ఫిబ్రవరి 17న ఈ మూవీని ఇతర చిత్రాలకు పోటీగా దించుతున్నాడు. ధనుష్ సర్, విశ్వక్ సేన్ ధమ్కీ వంటి సినిమాలు బరిలో ఉండగా.. సమంత శాకుంతలం కూడా రంగంలో దిగనుంది. మరి వీటితో సమంత పోటీ పడి నెగ్గుతుందా? మరోసారి గుణ శేఖర్ తన మార్క్ చూపిస్తాడా? అన్నది చూడాలి.

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News